Third phase of land auction was held in Kokapet : కోకాపేట నియోపొలిస్‌లోని ప్రీమియం భూములకు మూడో విడత ఈ-వేలం ప్రక్రియ  ముగిసింది.  హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహించిన ఈ వేలంలో రెండు ప్లాట్లకు ఎకరానికి రూ.118 నుంచి 131 కోట్ల వరకు ధర పలికింది. మొత్తం 8.04 ఎకరాలకు రూ.1,000 కోట్ల మేర ఆదాయం సమకూరింది. మొత్తం మూడు విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలకు రూ.3,708 కోట్లు లభించింది. నాలుగో విడత శుక్రవారం వేలం జరగనుంది. మొత్తంగా ఐదు వేలకోట్లను ప్రభుత్వం ఆశిస్తోంది.   కోకాపేటలో హెచ్‌ఎండీఏ మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో వేలం వేస్తోంది.  మొత్తం ఆరు ప్లాట్లు  27 ఎకరాలు వేలం అయ్యాయి. మొత్తం ఆదాయం రూ.3,708 కోట్లు వచ్చింది. ఇది హైదరాబాద్ చుట్టూ భూమి అభివృద్ధి, రోడ్లు, పార్కులు వంటి ప్రాజెక్టులను చేపడతారు. 

Continues below advertisement

కోకాపేట నియోపొలిస్ (Neopolis) లేఅవుట్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల వేలాలు  భారీగా నిధులు కురిపిస్తున్నాయి. 2021 జూన్‌లో మొదటి విడతలో 8 ప్లాట్లు  సుమారు 50 ఎకరాలు కు రూ.2,000 కోట్లు, 2023 ఆగస్టులో రెండో విడతలో 7 ప్లాట్లు  45.33 ఎకరాలు కు రూ.3,300 కోట్లు సమకూరాయి. మొత్తం 95 ఎకరాలకు ఎకరానికి రూ.40 నుంచి 100.75 కోట్ల వరకు ధరలు పలికి, హెచ్‌ఎండీఏకు రూ.5,300 కోట్లు ఆదాయం వచ్చింది.   

హెచ్‌ఎండీఏ 2021 జూన్ 10న మొదటి విడత ఈ-వేలాన్ని MSTC పోర్టల్ ద్వారా నిర్వహించింది. కోకాపేట్‌లోని నియోపొలిస్ లేఅవుట్‌లో 8 ప్లాట్లు   వేలం  శారు.  అప్పట్లో అప్‌సెట్ ప్రైస్ ఎకరానికి రూ.25 కోట్లు పెట్టారు.  బిడ్ రేంజ్ ఎకరానికి రూ.31.2 నుంచి 60.2 కోట్ల వరకు పలికింది. గరిష్ఠ బిడ్ రూ.60 కోట్లు  ఒక ఎకరం ప్లాట్‌కు పెట్టి కొనుగోలు చేశారు. ఐదేళ్లోలనే ఈ రేటు రూ. 131 కోట్లకు చేరుకుంది.  ప్రెస్టీజ్ గ్రూప్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ వేలం హైదరాబాద్‌ను దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా  మారింది. 

2023 ఆగస్టు 3న రెండో విడత వేలం జరిగింది. 7 ప్లాట్లు  3.6 నుంచి 9.71 ఎకరాల వరకు ఉన్నాయి. అప్‌సెట్ ప్రై ధర ఎకరానికి రూ.35 కోట్లు కానీ ఎకరానికి రూ.67.25 నుంచి 100.75 కోట్ల వరకు కొనుగోలుచేశారు.  గరిష్ఠ బిడ్ రూ.100.75 కోట్లు రాజపుష్పా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ – 3.6 ఎకరాల ప్లాట్‌కు దక్కించుకుంది.