Special Buses for secunderabad Ujjaini Mahankali bonalu | హైదరాబాద్: బోనాలు వచ్చాయంటే చాలు హైదరాబాద్‌లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇదివరకే గోల్కొండతో బోనాల సంబరాలు మొదలయ్యాయి.  సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ భక్తులకు శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం #TGSRTC ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. 175 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. 


హైదరాబాద్ (Hyderabad) లోని 24 ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు తిప్పనుంది. కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, మెహిదీపట్నం, దిల్‌ షుక్‌నగర్‌, కూకట్‌పల్లి, పటాన్‌ చెరు, ఈసీఐఎల్‌, పాత బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, చార్మినార్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా జులై 21, 22 తేదీలలో ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్ అమ్మవారి బోనాలకు వెళ్లే  భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.




బస్సుల రూట్ వివరాలివే..
1. ఎంజీబీఎస్ నుంచి సికింద్రాబాద్ - 5 బస్సు సర్వీసులు
2. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ - 4 బస్సు సర్వీసులు
3. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్ - 5 బస్సు సర్వీసులు
4. ఛార్మినార్ నుంచి సికింద్రాబాద్ - 5 బస్సు సర్వీసులు
5. బాలాజీ నగర్ నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
6. నాంపల్లి నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
7. రిసాల బజార్ నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
8. HPT వెంకటాపురం నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
9. HPT ఓల్డ్ అల్వాల్ నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
10. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
11. కుషాయిగూడ నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
12. చర్లపల్లి నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
13. హకీంపేట నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
14. ఓల్డ్ బోయిన్ పల్లి నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
15. RJNR ఛార్మినార్ నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
16. RJNR మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ - 6 బస్సు సర్వీసులు
17. సైనిక్ పురి నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
18. సనత్ నగర్ నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
19. జామియా ఉస్మానియా నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
20. జీడిమెట్ల నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
21. జగద్గిరిగుట్ట నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
22. కేజీహెచ్‌బీ నుంచి సికింద్రాబాద్ - 8 బస్సు సర్వీసులు
23. బోరబండ నుంచి సికింద్రాబాద్ - 7 బస్సు సర్వీసులు
24. పటాన్ చెరు నుంచి సికింద్రాబాద్ - 7 బస్సు సర్వీసులు
మొత్తం 175 బస్సు సర్వీసులను రాష్ట్ర ఆర్టీసీ నడపనుంది.