నీట్ పీజీ-2023 పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. నీట్ పీజీ పరీక్షలు మార్చి 5 నుంచి నిర్వహించాలని పరీక్షల నిర్వహణ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వరంగల్‌కు చెందిన పి.మురళీకృష్ణ మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ పుల్లా కార్తీక్‌లతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 15న విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కొవిడ్ నేపథ్యంలో ఎంబీబీఎస్ పరీక్షల నిర్వహణ జాప్యం జరిగిందని, ఎంబీబీఎస్ పరీక్షల అనంతరం నీట్ పీజీ పరీక్షలకు సిద్ధం కావడానికి కనీస గడువు అవసరమన్నారు. గతేడాది మాదిరిగానే నీట్ పీజీ పరీక్షలను మే నెలలో నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం నీట్ పీజీ పరీక్షల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీనిపై ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది.
పీహెచ్‌డీ ప్రవేశాలకూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్: హైకోర్టు
పీహెచ్‌డీ ప్రవేశాలకూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఉస్మానియా వర్సిటీకి హైకోర్టు ఫిబ్రవరి 15న ఆదేశాలు జారీ చేసింది. పీహెచ్‌డీ ప్రవేశాలకు రిజర్వేషన్లు వర్తింపజేయకపోవడాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ చింతల్‌కు చెందిన ఎన్.ఉమ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.పీహెచ్‌డీతో సహా ఇతర కోర్సుల్లోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.
Also Read:
JEE Main 2023 Application: జేఈఈ మెయిన్స్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్-2 పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7న ప్రారంభం కావాల్సిన దరఖాస్తు ప్రక్రియ.. వారం రోజుల ఆలస్యంగా ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కొత్త అభ్యర్దులతోపాటు మొదటి సెషన్ రాసిన అభ్యర్ధుులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు మార్చి 12న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఏ) ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.
జేఈఈ మెయిన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
CMAT: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ - 2023 నోటిఫికేషన్ విడుదల
దేశవ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)-2023 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్-2023, నోటిఫికేషన్ విడుదల, అర్హతలివే!
ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)-2023 నోటిఫికేషన్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)' విడుదల చేసింది. ఫార్మసీ డిగ్రీ పూర్తిచేసిన, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎం.ఫార్మసీ)లో ప్రవేశానికి జీప్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి.
నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..