ఆర్మీలో అగ్నివీరుల నియామకానికి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2023-24 కు సంబంధించి ఫిబ్రవరి 16 నుంచి అగ్నిపథ్ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు మార్చి 15 తుదిగడువు. అనంతరం ఏప్రిల్ 17 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.


వివరాలు..


* ఆర్మీ రిక్రూట్‌మెంట్- అగ్నిపథ్ స్కీమ్


1) అగ్నివీర్ జనరల్ డ్యూటీ 


అర్హత: 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి. లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 


వయోపరిమితి: 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.


2) అగ్నివీర్ టెక్నికల్


అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు ఉండాలి. లేదా పదోతరగతితోపాటు రెండేళ్ల ఐటీఐ/ మూడేళ్ల డిప్లొమా అర్హత ఉండాలి.


వయోపరిమితి: 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.


3) అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ (టెక్నికల్)


అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. 


వయోపరిమితి: 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.


4) అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (10వ తరగతి ఉత్తీర్ణత)


అర్హత: పదోతరగతి విద్యార్హత ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి. 


వయోపరిమితి: 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.


5) అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (8వ తరగతి ఉత్తీర్ణత)


అర్హత: 8వ తరగతి విద్యార్హత ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి. 


వయోపరిమితి: 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల్ ఈవెంట్ల ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 16.02.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.03.2023.


➥ ఆన్‌లైన్ రాతపరీక్ష తేది: 17.04.2023.


Notification


Online Application


Website




Also Read:


బీఎస్‌ఎఫ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్టులు - అర్హతలు ఇవే!
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ గ్రూప్- బి(నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు మార్చి 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో 248 ట్రేడ్స్‌మ్యాన్ స్కిల్డ్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీలో ట్రేడ్స్ మ్యాన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నేవీకి చెందిన నావికాదళ యూనిట్లు/ నిర్మాణ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మార్చి 3 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...