Telangana Student Praveen Dead: అమెరికాలో తెలంగాణ విద్యార్థి హత్య- షాపింగ్ మాల్‌లో దారుణం!

Telangana Student Praveen Dead: తెలంగాణకు చెందిన మరో విద్యార్థి అమెరికాలో మృతి చెందాడు. షాప్‌లో ఉండగానే దుండగులు అతన్ని కాలేచి చంపేశారు.

Continues below advertisement

Telangana Student Praveen Dead: అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన 26 ఏళ్ల విద్యార్థి అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నాడు. అతను బుల్లెట్ గాయాలతో చనిపోయినట్టు బుధవారం కుటుంబ సభ్యులకు స్నేహితులు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన జి.ప్రవీణ్ విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో పీజీ చేస్తున్నాడు. అతన్ని ఒక షాప్‌లో దుండగులు కాల్చి చంపారు. ఈ విషయాన్ని అతనిస్నేహితులు, అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.  

Continues below advertisement

దాడికి ముందు తల్లిదండ్రులకు ప్రవీణ్ పోన్

ప్రవీణ్ మృతికి కారణాలపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. మృతి విషయాన్ని కుటుంబానికి బుధవారం ఉదయం అమెరికా అధికారులు సమాచారం అందించారు. అయితే దాడి జరగడానికి ముందే తెల్లవారుజామున ప్రవీణ్ తన తండ్రికి ఫోన్ చేశాడు. కానీ అప్పటికే ఆయన నిద్రపోవడంతో కాల్ తీయలేకపోయాడు. తర్వాత కొన్ని గంటల తర్వాత దుర్వార్తను  అమెరికా అధికారులు ప్రవీణ్ తల్లిదండ్రులు చెప్పారు. దీంతో వారు షాక్‌లోకి వెళ్లారు.  

వ్యాపారి అయిన గంప రాఘవులు, రమాదేవి దంపతులకు ప్రవీణ్‌కుమార్‌ పెద్దకుమారుడు. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి 2023 ఆగస్టులో మిల్వాకీలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌లో ఎంఎస్‌ కోసం వెళ్లాడు. అక్కడే షాపింగ్‌ మాల్‌లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం వేకువజామున ఫోన్ చేశాడు. ఉదయాన్నే ఫోన్ చూసుకున్న తల్లిదండ్రులు వాట్సాప్‌ కాల్‌ చేశారు. మెసేజ్‌ చేశారు. అయినా రిప్లై రాలేదు. కానీఏడు గంటలకు అమెరికా అధికారులు ఫోన్ చేశారు. చనిపోయిన విషయం చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. 

Also Read: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌

సైబర్ నేేరగాళ్లని ఫోన్ కట్ చేసిన ప్రవీణ్‌ తల్లిదండ్రులు

ముందు ప్రవీణ్ పేరెంట్స్‌కు ఫోన్ చేసిన వ్యక్తులు ప్రవీణ్ గురించి ఆరా తీశారు. వీళ్లంతా సైబర్‌ నేరగాళ్లు అనుకుని భయపడి ఫోన్ కట్ చేసేశారు. కాసేపటి తర్వాత ప్రవీణ్ ఫ్రెండ్స్‌ ఫోన్ చేశారు. అప్పుడు ప్రవీణ్‌ను హత్య చేసిన విషయాన్ని పేరెంట్స్‌కు వివరించారు.  

ప్రభుత్వానికి రిక్వస్ట్ చేస్తున్న కుటుంబ సభ్యులు

పోస్టుమార్టం తర్వాత ప్రవీణ్‌ మరణానికి కారణం తెలుస్తుందని యుఎస్ అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. బి టెక్ చదివిన ప్రవీణ్ 2023లో ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లాడు. 2024 డిసెంబర్‌లో స్వగ్రామానికి వచ్చాడు. ఈ సంవత్సరం జనవరిలో తిరిగి అమెరికా వెళ్లాడు. ప్రవీణ్ మృతదేహం భారత్‌కు రప్పించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఆరు నెలల్లో ముగ్గురు మృతి 

ఆరు నెలల్లో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇలా దుండగుల బారిన పడి చనిపోయారు. గత సంవత్సరం నవంబర్‌లో ఖమ్మం విద్యార్థి ఒకరు, ఈ జనవరిలో హైదరాబాద్‌కు చెందిన మరొకరు అమెరికాలో ఇలా హత్యకు గురయ్యారు. ఇప్పుడు మరో విద్యార్థిది అదే పరిస్థితి. ఇలాంటి తరచూ జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్‌కు మట్టిదిబ్బల గండం- అక్కేడ కార్మికులు ఉన్నట్టు అనుమానం

Continues below advertisement
Sponsored Links by Taboola