డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నూతన భవనాన్ని ప్రారంభించి, అందులో 6వ ఫ్లోర్ లోని తన ఛాంబర్ లో అడుగిడిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్ర శేఖర్ రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం ఎఫ్ -1, 27వ గదిలో తన ఛాంబర్ లో సకుటుంబ సమేతంగా, తన సిబ్బందితో కలిసి పూజలు చేసి, తన సీటులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూర్చున్నారు.
తొలి సంతకం అదే..
కొత్త మండలాలకు ఐకేపీ భవన నిర్మాణాల అనుమతి ఫైలు పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తొలి సంతకం చేశారు. కస్టమర్ హైర్ సెంటర్ల ఫైల్ పై నూతన సచివాలయ భవనంలో మంత్రి దయాకర్ రావు తొలి సంతకం చేశారు. ఒక్కో సెంటర్ ను రూ.25 లక్షల తో ఏర్పాటు చేయనున్నారు. తమ సతీమణి ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు, తన కుటుంబ సభ్యులతోపాటు నూతన భవనంలోకి అడుగుపెట్టారు మంత్రి ఎర్రబెల్లి.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయంను అద్భుతంగా తీర్చిదిద్దారు. దేశంలోనే గొప్ప కట్టడంగా రూపు దిద్దుకుంది. ఇంత పెద్ద, ఎత్తైన సచివాలయం దేశంలోని ఏ రాష్ట్రానికి కూడా లేదు. 28 ఎకరాల స్థలంలో... రెండున్నర ఎకరాల భవనం నిర్మాణమైంది. భిన్న సంస్కృతుల సమ్మేళనంగా తెలంగాణ సచివాలయం ఉంది. 2వేల మంది ఉద్యోగులు, మంత్రులు, ఐఎఎస్ అధికారులు పని చేసే విధంగా ఉంది. తెలంగాణ సచివాలయం నభూతో... న భవిష్యతి. తెలంగాణ సచివాలయం చరిత్ర... చరిత్రలో నిలిచిపోయే విధంగా కెసిఆర్ నిర్మించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం బాగుంది. ఇలాగే పార్లమెంటు కు అంబేద్కర్ పేరు పెట్టాలి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు, ఎమ్మెల్సీలు, ఎమ్మేల్యేలు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాశాఖల అధికారులు హాజరయ్యారు.
మంత్రి ఎర్రబెల్లి నూతన భవన, నూతన కార్యాలయ ప్రవేశ కార్యక్రమానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డా. బండ ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బిఆర్ ఎస్ లోక్ సభా నాయకుడు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు ఒద్దిరాజు రవిచంద్ర, లోక్ సభ సభ్యులు పసునూరు దయాకర్, రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ప్రభాకర్, తక్కెళ్ళపల్లి రవిందర్ రావు, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యా నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, అరూరి రమేశ్, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్, సండ్ర వెంకట వీరయ్య, రేగా కాంతారావు, దానం నాగేందర్, జెడ్పీ చైర్మన్లు పాగాల సంపత్ రెడ్డి(జనగామ), కుసుమ జగదీశ్ (ములుగు), సుధీర్ కుమార్ (హనుమకొండ), గండ్ర జ్యోతి (వరంగల్), ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు తదితరులు హాజరై తమ శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావులు మంత్రి దయాకర్ రావుకి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్లు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, మహబూబాబాద్ కలెక్టర్ శశాంక్, జనగామ కలెక్టర్ శివలింగయ్య, భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రాలు హాజరై మంత్రికి శుభాకంక్షలు తెలిపారు.
అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్ కమిషనర్లు, ప్రసాద్, ప్రదీప్ కుమార్ శెట్టి, ఇఎన్ సి లు కృపాకర్ రెడ్డి, సంజీవరావు, స్త్రీ నిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి తదితరల అధికారులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి సత్యవతి రాథోడ్ చాంబర్ కు వెళ్ళి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.ఎస్ సత్యనారాయణరెడ్డి, ఓఎస్‌డి లు రాజేశ్వర్ రావు, రవిందర్ రావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.