Sajid Akram : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కలకలం సృష్టించిన బోండీ బీచ్ ఉగ్ర దాడికి సంబంధించి వెలువడిన తాజా వివరాలు దేశంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపాయి. మారణహోమం సృష్టించిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ మూలాలు హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతంలో ఉన్నాయని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది.
ఐసిస్ ప్రేరేపిత ఉగ్ర దాడిగా ఆస్ట్రేలియా పోలీసులు ప్రకటించిన ఈ దాడిలో మొత్తం 15 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణానికి పాల్పడిన తండ్రీ కుమారులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్‌లలో సాజిద్ పోలీసుల కాల్పుల్లో అక్కడికక్కడే హతమయ్యాడు. కాగా అతడి కుమారుడు నవీద్ అక్రమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక అంతర్జాతీయ ఉగ్ర దాడిలో నిందితుడికి హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నాయనే వార్త తీవ్ర భయాందోళనలను కలిగించాయి.
హైదరాబాదీ సాజిద్ కథ: 27 ఏళ్లుగా భారతీయ పాస్‌పోర్టుతోనే...
సాజిద్ అక్రమ్ జీవన ప్రయాణం చాలా మందికి తెలియని ఒక చీకటి కోణం. అతను 1998వ సంవత్సరంలో విద్యార్థి వీసాపై ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అంటే, సుమారు 27 ఏళ్ల కిందట అతను భారత్ నుంచి వలస వెళ్లాడు. ముఖ్యంగా గమనించదగిన విషయం ఏంటంటే సుదీర్ఘ కాలంలో సాజిద్ ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకోకుండా ఇప్పటికే భారతీయ పాస్‌పోర్ట్‌తోనే కొనసాగుతున్నట్టు దర్యాప్తులో తేలింది.
అతను హైదరాబాద్‌లో బీకాం పూర్తి చేసి ఆ తర్వాతే ఆస్ట్రేలియాకు వెళ్లినట్టు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. 2001లో సాజిద్ ఐరోపా దేశానికి చెందిన వెనెరా గ్రోసో అనే మహిళను వివాదం చేసుకున్నాడు. ఈ వివాహం కారణంగా అతనికి భాగస్వామి వీసా లభించింది. ప్రస్తుతం అతనికి రెసిడెంట్ రిటర్న్‌వీసా మాత్రమే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 27 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో స్థిరపడినప్పటికీ, సాజిద్ కేవలం ఆర్‌ఆర్‌వీపై ఎందుకు కొనసాగుతున్నాడు అనే అంశంపై ఆస్ట్రేలియా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యాన్ని మరింత అనుమానాస్పదంగా మారుస్తోంది.
ఐసిస్ శిక్షణ; నెల రోజులు మిస్సింగ్ డ్రామా
సిడ్నీ కాల్పులు ఐసిస్ ప్రేరేపిత ఉగ్ర దాడి అని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసు కమిషనర్ క్రెస్సీ బారెట్, న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యోన్ నిర్దారించారు. ఈ దాడికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మరింత ఆందోళన కలిగిస్తోంది. గత నెల నవంబరులో సాజిద్ అక్రమ్ తన కుమారుడు నవీద్ అక్రమ్‌తో కలిసి ఫిలిప్పీన్స్‌కు వెళ్లినట్టు దర్యాప్తులో తేలింది. ఫిలిప్పీన్స్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అందించిన వివరాల ప్రకారం, సాజిద్ అక్రమ్ నవంబరు1 నుంచి నవంబర్28 వరకు ఫిలిప్పీన్స్‌లోనే ఉన్నాడు. ఆ సమయంలో నవీద్ కూడా అతనితోపాటు దవావో ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. నెల రోజులు అక్కడే ఉండి ఐసిసి ఉగ్ర శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తోంది. దక్షిణ ఫిలిప్పైన్‌లోని దవోవో ప్రాంతంలో అబూ సయ్యఫ్‌తో సా పలువురు మిలిటెంట్లు ఐసిస్‌కు మద్దతు ఇస్తుంటారు. వీరు ఆసియా, పశ్చిమాసియా, అయినప్పటికీ, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్ల ఇటీవల వారి కార్యకలాపాలు తగ్గాయి.
నవీద్‌కు సంబంధించిన కారులో దర్యాప్తు చేసిన పోలీసులకు పేలుడు పదార్థాలతోపాటు రెండు ఐసిసి జెండాలు దొరికాయని కమిషనర్ లాన్యోన్ తెలిపారు. ఈ సాక్ష్యాధారాలు, ఫిలిప్పీన్స్ పర్యటన, నెల రోజులపాటు తీసుకున్న శిక్షణ... ఇవన్నీ కూడా బోండీ బీచ్‌లో జరిగిన దాడి కేవలం వ్యక్తిగత ద్వేషం కాదని, అది పూర్తిగా వ్యవస్థీకృత ఐసిసి ప్రేరేపిత ఉగ్ర చర్య అని స్పష్టం చేస్తున్నాయి.
సాజిద్ అక్రమ్ హైదరాబాద్ మూలాలు, అతని కుటుంబ నేపథ్యంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాజిద్‌కు హైదరాబాద్‌లో ఎలాంటి నేర చరిత్ర లేదని డీజీపీ శివధర్ రెడ్డి, మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. అతడు బీకాం పూర్తి చేసి ఉన్నత చదువుల కోసమే 1998లో ఆస్ట్రేలియా వెళ్లాడు.
పోలీసుల టోలిచౌకిలోని సాజిద్ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లగా, ఆ ఇంటికి తాళం వేసి ఉంది. సాజిద్‌కు క అన్న ఉన్నాడని, అతను హైదరాబాద్‌లోని ఒక వైద్య కళాశాలలో వైద్యుడిగా పని చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లైంది. స్థానికుల ద్వారా అందిన సమాచారం ప్రకారం సాజిద్ ఇక్కడ ఉన్నప్పుడు ఎవరితోనూ పెద్దా కలివిడిగా ఉండేవాడు కాదు. అతను విదేశాలకు వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులతో కూడా దూరంగా ఉంటున్నాడు. సాజిద్ తండ్రి యుఏఈ సైన్యంలో పని చేసి పదవీ విరమణ పొందిన తర్వాత హైదరాబాద్‌తిరిగి వచ్చి 2017లో మరణించారు.
తండ్రి మరణించినప్పుడు కూడా సాజిద్ హైదరాబాద్ రాలేదని దర్యాప్తు తేలింది. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత నుంచి ఇప్పటి వరకు సాజిద్ కేవలం ఆరుసార్లు మాత్రమే భారత్‌కు వచ్చి వెళ్లాడు. అవి కూడా ఎక్కువగా ఆస్తి విషయాలు, వృద్ధులైన తల్లిదండ్రులను చూసేందుకు మాత్రమే. తన భార్య వెనెరా, కుమారుడు నవీద్, కుమార్తెను ఒక్కసారి కూడా హైదరాబాద్ తీసుకురాలేదని పోలీసు విచారణలో స్పష్టమైంది. ఈ వివరాలన్నీ సాజిద్ ఒంటరితనాన్ని, కుటుంబ సంబంధాలకు దూరంగా ఉన్న అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. తమ కుమారుడు, మనడు ఉగ్రవాదం వైపు మళ్లినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు చెబుతున్నారు. ఈ దర్యాప్తులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు తెలంగాణ పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారని డీజీపీ తెలిపారు.