Telangana IAS Officials Transfer: పలువురు ఐఏఎస్‌లను, పలువురు డీఎస్పీలను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, జౌళిశాఖ (Handloom Textiles Department) కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను నియమితులయ్యారు. రిజిస్ట్రేషన్‌, స్టాంపుల కమిషనర్‌గా రాహుల్‌ బొజ్జాకు, రవాణా శాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేశారు. జీడీఏ కార్యదర్శిగా వి శేషాద్రికి, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు తెలంగాణ సర్కార్ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఔషధ నియంత్రణ సంచాలకులుగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు.






తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ
Telanagana IPS Officials Transfer: రాష్ట్రంలో పలువురు డీఎస్పీలను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. కామారెడ్డి (R) ఎల్లారెడ్డి  డీఎస్పీగా A.శ్రీనివాసులు,  వేములవాడ డీఎస్పీగా కె.నాగేంద్ర చారి, అచ్చంపేట్ డిఎస్పీగా కె కృష్ణ కిషోర్, నాగర్‌కర్నూల్ డీఎస్పీగా బి.మోహన్ కుమార్, నిర్మల్ డీఎస్పీగా ఎల్.జీవన్ రెడ్డి, హనుమకొండ (వరంగల్) ట్రాఫిక్ ఏసీపీగా A.మధుసూదన్, ఎల్బీనగర్ ఏసీపీగా సి.అంజయ్యను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.






Also Read: Telangana CM KCR చిల్లర బుద్దిని చూడలేకే ఆ నిధులపై కేంద్రం రూట్ మార్చింది: బండి సంజయ్


Also Read: Politics With Mogulaiah : మొగులయ్య పావుగా బీజేపీ , టీఆర్ఎస్ రాజకీయాలు ! ఆ వీడియోలతో హల్ చల్