Ganesh Immersion: హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో, చెరువుల్లో నిమజ్జనం చేయవద్దని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) తో తయారు చేసిన గణేష విగ్రహాలు అన్నింటిని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ తాత్కాలిక నీటి కుంటల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు, జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.
ఇదే సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన వినిపించిన వాదనల సమయంలోన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ)తో తయారు చేసిన గణేష్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్ తో పాటు చెరువుల్లో నిమజ్జనం చేయవద్దని.. ఈ విషయంపై గత సంవత్సరం ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని హైకోర్టు పేర్కొంది.
పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం ఎత్తేయాలని.. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) నిబంధనలను కొట్టి వేయాలని పేర్కొంటూ గణేష్ మూర్తి కళాకారుల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్ ల తరఫు న్యాయవాధి.. ధూల్ పేట్ వాసులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపకుండా ప్రస్తుత ఉపాధిని దెబ్బతీయడం సరికాదని పేర్కొన్నారు.
మరో న్యాయవాది వేణు మాధవ్ హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. గత సంవత్సరం హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారని గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాధి వాదనలు వినిపించారు. గత సంవత్సరం హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయలేదని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను జీహెచ్ఎంసీ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లో నిమజ్జనం చేసినట్లు తెలిపారు.
గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఒకే రోజు
సెప్టెంబర్ 28న గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఉన్నాయి. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ రెండు వేడుకలు ఓకే రోజు వస్తున్నాయి. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం వేల మంది పోలీసులను ప్రభుత్వం నియోగించనుంది. ఇక మ్యాచ్ జరిగే రోజూ నిమజ్జనం కొనసాగుతుంది. అలాంటప్పుడు ముందు రోజే 24 గంటలు డ్యూటీ చేసిన పోలీసులు అలసిపోయే ప్రమాదం ఉంది. దాంతో మ్యాచుకు బందోబస్తు కష్టమని పోలీసు ఉన్నతాధికారులు హెచ్‌సీఏకు తెలిపారు. ఈ మేరకు మ్యాచ్ తేదీని మార్చాలని బీసీసీఐకి హైదరాబాద్ క్రికెట్ సంఘం విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.
రెండు రోజుల క్రితమే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో తలపడే జట్టును న్యూజిలాండ్ ప్రకటించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ - చెన్నై మ్యాచ్‌లో గాయమై శస్త్రచికిత్స చేయించుకొని ఇన్నాళ్లూ ఆటకు దూరమైన కేన్ మామ తిరిగి జాతీయ జట్టుతో చేరాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో కివీస్ నలుగురు పేసర్లు, ఇద్దరు పేస్ ఆల్ రౌండర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. మిగిలినవారిలో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉన్నారు. కాగా గతేడాది కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వ్యక్తిగత కారణాల రీత్యా న్యూజిలాండ్ బోర్డు కాంట్రాక్టు వదులకున్నా అతడిని ప్రపంచకప్ నేపథ్యంలో జట్టులో చేర్చారు. బౌల్ట్‌తో పాటు జేమ్స్ నీషమ్ కూడా కాంట్రాక్టు లేకున్నా వరల్డ్ కప్ జట్టులో చేరాడు. ఇక ఇంగ్లాండ్‌తో వన్డేలకు దూరమైన కైల్ జెమీసన్, ఆడమ్ మిల్నేలకు నిరాశతప్పలేదు.