Telangana Latest News: తెలంగాణలో మొబైల్ వినియోగదారులు ఉన్న జనాభా కంటే ఎక్కువ ఉన్నట్టు ట్రాయ్ ఓ నివేదిక విడుదల చేసింది. సెప్టెంబర్ వరకు ఉన్న డేటా ప్రకారం తెలంగాణలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 4.19 కోట్లు. ఇందులో మొబైల్ వినియోగదారులు 4.4 కోట్ల మంది, ల్యాండ్‌లైన్ వినియోగదారుల 15.25 లక్షల మంది ఉన్నారు.
రాష్ట్ర వైర్‌లెస్ టెలీ డెన్సిటీ 105.32 శాతం అంటే ప్రతి 100 మందికి 105కిపైగా మొబైల్ ఫోన్లు ఉన్నట్టు నివేదికలో తేలింది. ఈ డెన్సిటీలో గోవా టాప్‌లో ఉంటే తర్వాత స్థానం కేరళది. అనంతరం హర్యానా మూడో స్థానం ఉంది. తెలంగాణ నాల్గో స్థానంలో ఉంది. టాప్‌లో ఉన్న గోవాలో ప్రతి వందమందికి 152 ఫోన్‌లు కలిగి ఉన్నారు. కేరళ-115, హర్యానా 114 శాతం ఉందన్నమాట.
డిజిటల్ కనెక్టివిటీలో తెలంగాణకు ఇదో మైలురాయిగా చెప్పవచ్చు. ప్రస్తుతం జాతీయ సగటు 82 శాతమే ఉంటే తెలంగాణ వంద దాటిపోయింది. ఇది తెలంగాణ వ్యాప్తంగా డిజిటల్ సదుపాయాలు ఏ స్థాయిలో విస్తరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
టెలిఫోన్ వినియోగంలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. గ్రామాల్లో 39 శాతం ఉంటే... పట్టణాల్లో 60 శాతంపైగా ఉంది. మొబైల్ ఫోన్ల వినియోగంలో గ్రామాల్లో 41శాతం ఉంటే... పట్టణాల్లో 59శాతంగా ఉంది. ల్యాండ్‌లైన్ ఫోన్‌లను గ్రామాలల్లో కేవలం నాలుగు శాతం మందే వాడుతుంటే పట్టణాల్లో పట్టణాల్లో 96 మంది యూజ్ చేస్తున్నారు.
డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడానికి, ఇంటర్నెట్ యాక్సెస్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయి. మొబైల్ నెట్‌వర్క్ కవరేజీ మెరుగుపరిచి ఇంటర్నెట్ సేవలు అందడంతో ఎక్కువ మంది డిజిటల్ వైపు మొగ్గుతున్నారు. ఇది గ్రామీణ, పట్టణ జనాభాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇలా డిజిటల్ పెసిలిటీ పెరుగుదల విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యాపారం, పాలనకు సహాయకారిగా ఉంటాయి.