Telangana News: తెలంగాణ డీఎస్సీ 2024 లో ఎంపికై ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లకు ఇది బిగ్ అలర్ట్. ఉపాధ్యాయ పోస్టింగ్ కేటాయించేందుకు  నిర్వహించే కౌన్సెలింగ్ వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది.  ఈ మధ్య విడుల చేసిన డీఎస్సీ-2024 ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ పత్రాలు తీసుకున్న 10,006 మందికి ఇవాళ్టి నుంచి పోస్టింగ్ అలాట్ చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. డీఈవో ఆఫీస్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. అభ్యర్థులందరికీ ప్రత్యేకంగా సమాచారం ఇచ్చారు. కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. 


ఎందుకు వాయిదా పడింది?


జిల్లాలకు సంబంధించిన డాటా ఇంకా పూర్తిస్థాయిలో రాకపోవడంతో ప్రస్తుతానికి కౌన్సెలింగ్ వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు. డాటా వచ్చిన వెంటనే కొత్త తేదీలు ప్రకటిస్తామన్నారు. ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటన ఉంటుందని అంటున్నారు. జిల్లాలో కౌన్సిలింగ్ నిర్వహించాలి అంటే వివిధి జిల్లాలో ఉన్న వేకెన్సీలు, స్కూళ్ల డాటా లేటెస్ట్ ఉండాలి. దాన్ని ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రక్రియ పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ డాటా లేకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తే గందరగోళం ఏర్పడుతుందని అంటున్నారు.