Somesh Kumar IAS: మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్ భూములపై ప్రభుత్వం ఆరా - ఏటా లక్షల్లో రైతు బంధు!

Somesh Kumar IAS: డీఓపీటీ (Department of Personnel and Training) అనుమతి లేకపోయినా లక్షల్లో సోమేశ్ కుమార్ లక్షల్లో రైతుబంధు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Continues below advertisement

Telangana Former Chief Secretary Somesh Kumar: తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై ప్రస్తుత ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. కేసీఆర్ ప్రభుత్వంలో సీఎస్‌గా ఉన్న సమయంలో సోమేశ్ కుమార్ అక్రమంగా భూముల కొనుగోలు చేశారని ఆదరోపణలు ఉన్నాయి. ఆ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఆరా తీస్తుంది. అలా కొనుగోలు చేసిన తర్వాత లక్షల్లో రైతుబంధు డబ్బులను సోమేశ్ కుమార్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Continues below advertisement

డీఓపీటీ (Department of Personnel and Training) అనుమతి లేకపోయినా లక్షల్లో సోమేశ్ కుమార్ లక్షల్లో రైతుబంధు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొత్తపల్లి విలేజ్ లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటివరకు రైతుబంధు 14 లక్షలు తీసుకున్నారని ప్రభుత్వం గుర్తించింది. భూమి సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు. 25 ఎకరాల 19 గుంటలు భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉండగా.. దానికి సైతం సోమేష్ కుమార్ రైతు బంధు పొందినట్లు గుర్తించారు. ప్రతి ఆరు నెలలకు రూ.1,27,375 చొప్పున సోమేశ్ కుమార్ రైతుబంధు తీసుకున్నారని తెలిసింది. అలా సంవత్సరానికి రూ.2,52,750 రూపాయల రైతుబంధు సోమేశ్ కుమార్ తీసుకున్నారు. 

మరోవైపు, సీఎస్ సోమేష్ కుమార్ భూముల కొనుగోలు పైన కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు డీవోపీటీ నుంచి సోమేశ్ కుమార్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని సమాచారం.

Continues below advertisement