Hyderabad Metro Project Phase 2 | హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ (బి) ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతి ఇచ్చింది. రూ.19,579 కోట్లతో అనుమతి ఇస్తూ ప్రభుత్వ కార్యదర్శి ఇలంబర్తి సోమవారం నాడు (జూన్ 16న) ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో అనుసంధాన ప్రాజెక్టుకు 125 కోట్లు విడుదల చేసింది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణ (Telangana) ప్రభుత్వం 30% ఖర్చు చేయనుండగా, కేంద్రం 18 శాతం, ఏడిబి, ఎన్డిబి, జైకా నుంచి 48 శాతం రుణం, పిపిపిలో మరో నాలుగు శాతం వాటాగా ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి కోసం త్వరలో పరిపాలన అనుమతిని డిపిఆర్ కు జత చేసి పంపనుంది. 

ఫేజ్ బిలో మూడు కారిడార్లు.. 

హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ (బి) బి ప్రాజెక్టులో కారిడార్ 9, కారిడార్ 10, కారిడార్ 11 లో మొత్తం 86.1 కిలోమీటర్లు మెట్రో విస్తరించనున్నారు. కారిడార్ 9 లో భాగంగా శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 10లో భాగంగా జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 11 లో భాగంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి శామీర్పేట వరకు 22 కిలోమీటర్లు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. 

హైదరాబాద్ ఓల్డ్ సిటీకి మెట్రో అనుసంధాన ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 125 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఇలంబర్తి సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీ మెట్రో ప్రాజెక్టుకు ఈ వార్షిక బడ్జెట్లో 500 గేట్లు కేటాయించగా, అందులో 125 కోట్లను ప్రాజెక్టు పనులకు తాజాగా విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025–26 బడ్జెట్ లో కేటాయించిన రూ.500 కోట్లో మెట్రో ఓల్డ్ సిటీప్రాజెక్ట్ కోసం రూ.125 కోట్లు మంజూరు చేసిన జీవో ఇక్కడ చూడండి.