తెలంగాణ సచివాలయంలో ప్రార్థనాలయాలు ప్రారంభం- పాల్గొన్న గవర్నర్, సీఎం

తెలంగాణ సెక్రటేరియట్‌లో ఏర్పాటు ప్రార్థనా మందిరాలను గవర్నర్‌, సీఎం కలిసి ప్రారంభించారు. ఎప్పటి నుంచో ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇద్దరూ కలిసి చాలా రోజుల తర్వాత ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continues below advertisement

తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆలయ ప్రారంభోత్సవంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.  కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీన్ని ఇవాళ గవర్నర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 

Continues below advertisement