Sigachi Industry Accident: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి తీవ్రవిషాదం రేపిన సిగాచి పరిశ్రమ ప్రమాదం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న ఆ పరిశ్రమలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేిసంది. ఇందుోల నలుగురు శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రమాదానికి కారాణాలు తెలుసుకొని భవిష్యత్‌లో ఇలాంటివి నివారించే ఉద్దేశంతో ఈ కమిటీ కీలక సూచనలు చేయనుంది. 

కమిటీలో సభ్యులు ఎవరు?

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి చైర్మన్ గా డాక్టర్ బి. వెంకటేశ్వరరావు ఉంటారు. డా.టి. ప్రతాప్ కుమార్, డా. సూర్య నారాయణ, డా.సంతోష్‌ గుగే సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దుర్ఘటనపై విచారణ చేసి బాధితులతో మాట్లాడి నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. 

కమిటీ సభ్యుల బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?సిగాచి పరిశ్రమలో ప్రమాదంపై దర్యాప్తునకు నియమించిన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న డాక్టర్ బి. వెంకటేశ్వరరావు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ఎమెరిటస్ శాస్త్రవేత్తగా ఉన్నారు. సభ్యుడిగా ఉన్న టి. ప్రతాప్ కుమార్ ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్, సూర్యనారాయణ మాత్రం చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో శాస్త్రవేత్తగా పని చేసి రిటైర్ అయ్యారు. సంతోష్ గుగే పుణేలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ భద్రతా అధికారి ఉన్నారు. 

కమిటీ  పరిశీలించనుంది ?

సిగాచి ఇండస్ట్రీలో అసలు ప్రమాదం ఎలా జరిగింది. రియాక్టర్ పేలుడు వల్ల ప్రమాదం జరగలేదని కంపెనీయే స్వయంగా చెబుతుంది. మరి ఇంత ఘోరానికి కారణం ఏంటి అనేది తేల్చాలని వెంకటేశ్వరరావు కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. పరిశ్రమలో భద్రతా లోపాలు ఉన్నాయా ఉంటే వాటిని కంపెనీ గుర్తించలేదా? ఇలా లోతైన దర్యాప్తు చేయాలని సూచించింది. దీంతోపాటు ఇలాంటి ప్రమాదకరమైన పరిశ్రమల్లో దుర్ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా సూచించనున్నారు. 

నేడు పరిశ్రమకు నిపుణుల కమిటీ 

ఈ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై ఫ్యాక్టరీల డైరెక్టర్‌ ప్రాథమికంగా విచారించారు. ఆ నివేదికను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ నివేదికను అధ్యయనం చేసిన తర్వాత నిపుణుల కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాథమిక దర్యాప్తు నివేదికను ముందుగా ఈ కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం పరిశ్రమలో పర్యటించి అక్కడి పరిస్థితులు తెలుసుకుంటుంది. పరిశ్రమ యాజమాన్యం, పరిశ్రమలో పని చేసే సిబ్బంది, కన్సల్టెంట్లు, ఇతర సంస్థల ప్రతినిధులు, అధికారులతో మాట్లాడబోతోంది.