Telangana Latest News: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ను క్లియర్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. మార్చి 31 లోపు క్రమబద్దీకకరణ చేసుకున్న వాళ్లు రాయితీ కూడా ఇస్తోంది. అంతే కాకుండా నేరుగా రిజిస్ట్రార్ ఆఫీస్‌లోనే ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 


పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, సీఎస్‌ శాంతికుమారి పాల్గొన్నారు. అనుమతి లేకుండా వేసిన లే అవుట్లకు గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. అందుకే నాలుగేళ్లుగా ఎల్‌ఆర్‌ఎస్ కోసం భారీ సంఖ్యలో జనం ఎదురు చూస్తున్నారు. చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 


Also Read:వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్


చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్లియర్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకున్న వారికి ప్రభుత్వం విధించే ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. నేరుగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులోనే క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించి రాయితీ పొందవచ్చు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను డీసీఎం ఆదేశించారు. 


ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో జాగ్రత్తలు అవసరమని అధికారులను ప్రభుత్వం సూచించింది. పేదలకు మంచి చేయాలన్న ఆలోచనతో ఈ చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ ముసుగులో నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలను కూడా క్రమబద్దీకరణకు ప్రయత్నించే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఇలాంటి వాటిపై ఓ కన్నేసి ఉంచాలని హితవు పలికింది. పేదలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన ఈ వెసులుబాటును వాడుకోవాలని ఆఫీస్‌ల చుట్టూ తిరిగకుండా కేవలం సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లోనే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. 


Also Read: బీఆర్ఎస్ బహిరంగసభ మరింత ఆలస్యం - ఏప్రిల్ 27వ తేదీ ఖరారు !


ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కీమ్‌ ద్వారా ఆక్రమిత ప్లాట్ల రిజిస్ట్రేష్ చేసుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో చివరి సారిగా అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి వీటిపై నిషేధం విధించింది. అందుకే చాలా కాలంగా భారీగా దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. 


 


ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేయాలంటే ఏం కావాలి?
ప్లాట్‌ డాక్యుమెంట్స్ 
ఐడీ ప్రూఫ్‌  
స్వాధీన ధ్రువపత్రం (Proof of possession)
ప్రొపర్టీ డాక్యమెంట్  
లే అవుట్‌ ప్లాన్‌ (ఇది పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో ఉండాలి. దాని సైజ్‌ 1 ఎంబీకి మించకుండా ఉండాలి. )
సేల్‌ డీడ్‌ లేదా ఈసీ (ఇది కూడా పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో 1ఎంబీకి మించకూడదు.)
ఓనర్‌షిప్‌ డాక్యుమెంట్‌ (ఇది కూడా పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో 1ఎంబీకి మించకూడదు.) 
ప్రోసెసింగ్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది.