Telangana Gaddar Film Awards 2025 Event: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు సహా ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
2014 నుంచి 2024 వరకూ గద్దర్ అవార్డులను ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. వాటిని పురస్కార గ్రహీతలకు అందిస్తున్నారు. అవార్డు గ్రహీతలకు సిల్వర్ మెమొంటో, రూ.5 లక్షల ప్రైజ్ మనీతో పాటు ప్రశంసా పత్రం అందించారు.
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా బన్నీ, బాలయ్య
సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ వేడుకకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. సీఎం రేవంత్, బన్నీ మధ్య బాలయ్య సందడి చేశారు. వేల మంది ఈవెంట్‌కు హాజరయ్యారు.
అవార్డులు అందుకుంది వీరే..
'గామి' చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా విశ్వనాథ్ రెడ్డి, ఉత్తమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా అద్నితిన్ జిహానీ చౌదరి.. 'కల్కి 2898ఏడీ' సినిమాకు అవార్డులు అందుకున్నారు. అలాగే, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను (రజాకార్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు & అజయ్ కుమార్ (కల్కి), ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మీనన్ (గామి), ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి (లక్కీ భాస్కర్), ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్, ఉత్తమ స్టోరీ రైటర్ శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి) అవార్డులు అందుకున్నారు.
Also Read: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ' - ఈ ప్లాట్ ఫాంలో చూసి ఎంజాయ్ చెయ్యండి