Telangana Decade Celebrations : తెలంగాణ దశాబ్ధి వేడుకల వేళ తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడి పదో ఏట అడుగు పెట్టినా ఇంకా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. అభివృద్ధి అంటే ఒక్క హైదరాబాద్‌లో ప్రగతి సాధించడం కాదని అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి కావాలన్నారు. 


రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం మాట్లాడిన ఆమె... ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ అంటే ఒక్క హైదరాబాద్‌ కాదని అ్నారు. హైదరాబాద్‌ అభఇవృద్ధి చెందినంత మాత్రాన రాష్ట్రమంతా అభివృద్ధి చెందినట్టు కాదన్నారు. మారుమూల పల్లెల్లో కూడా ప్రగతి ఫలాలు కనిపించాలన్నారు. అప్పుడే అసలైన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. రాష్ట్రం సిద్దించి పదేళ్లు అవుతున్నా ఉద్యమకారుల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదన్నారు. రాజ్‌భవన్‌లో వేడుకలు నిర్వహించిన గవర్నర్‌... ఉద్యమకారులకు సన్మానం చేశారు. అమర వీరులకు నివాళి అర్పించారు. 


కొంత మంది అభివృద్ధి కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అయితేనే సంపూర్ణ అభివృద్ధి అనిపించుకుంటుందన్నారు తమిళిసై. వచ్చే సంవత్సరం నాటికి దేశంలో తెలంగాణ నంబర్1 కావాలని ఆకాంక్షించారు. జై తెలంగాణ అంటే స్లోగన్ నినాదం కాదన్న ఆమె... అదో ఆత్మ గౌరవ నినాదమన్నారు. తన జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే పని చేస్తున్నట్టు వెల్లడించారు. దేవుడు తనను తెలంగాణకు పంపడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. నేను మీతో ఉన్నాను. మీరు నాతో ఉన్నారని ఉద్యమకారులతో మాట్లాడారు గవర్నర్.