TPCC Executive Committee : తెలంగాణ కాంగ్రెస్‌లో నియామకాలు జోరు అందుకున్నాయి. మొన్న పార్టీలోని  కొన్ని కమిటీలు నియమించిన అధిష్టానం, ఆదివారం మంత్రివర్గాన్ని విస్తరించింది. ముగ్గురికి స్థానం కల్పించింది. ఇప్పుడు జంబో పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 27 మంది ఉపాధ్యక్షులు ఉంటే, 50కిపైగా ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. 

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఈమేరకు నియమాక ఉత్తర్వులను ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జారీ చేశారు. కొత్తగా ఎంపికైన కమిటీలో ఎమ్మెల్యేలు వెడ్మబొజ్జ, మట్టా రాగమయి, పర్నికా రెడ్డిని జనరల్ సెక్రటరీలు నియమించారు. ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను ఉపాధ్యక్షులుగా నియమించారు. ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు కొత్త కమిటీలో స్థానం కల్పించారు. ఇంకా పార్టీలో చాలా కమిటీలకు వేకెన్సీ ఉన్నా వాటికి విపరీతమైన పోటీ ఉన్నందున వాటిపై ఇంకా కసరత్తు చేస్తున్నారు.