Revanth Reddy meets Komatireddy Venkat Reddy: హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హైటెక్ సిటీ యశోదా ఆసుపత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. అక్కడ చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల రోబోటిక్ టెక్నాలజీ ద్వారా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వైద్యులు Thyomectomy ట్రీట్మెంట్ అందించారు.




ఎన్నికల ముందు నుంచి గొంతు నొప్పితో ఇబ్బంది.. 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలోనూ అప్పటి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గొంతు నొప్పితో కాస్త ఇబ్బంది పడ్డారు. ఎన్నికలు పూర్తి కావడం, ఫలితాలు ప్రకటన తరువాత కోమటిరెడ్డి ఆరోగ్యంపై ఫోకస్ చేశారు. డాక్టర్ల సూచన మేరకు ప్రాథమిక చికిత్స కోసం మొదట డిసెంబర్ 13న సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరడం తెలిసిందే. అదే సమయంలో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనను పరామర్శించారు. అదే ఆస్పత్రిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. విషయం తెలియగానే ఎమ్మెల్సీ కవిత.. ఆయన అడ్మిట్ అయిన గదికి వెళ్లి మంత్రి కోమటిరెడ్డిని  పరామర్శించి ఆరోగ్యంపై ఆరాతీశారు.