Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి

ఆర్థిక నేరాలు ఎంత ప్రమాదకరమో, సైబర్ నేరాలు కూడా అంతే ప్రమాదకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Continues below advertisement

Cyber Security Conclave 2025 at HICC in Hyderabad | హైదరాబాద్: దేశంలో సైబర్ నేరగాళ్లు గత ఏడాది ఏకంగా రూ. 22,812 కోట్ల మేర దోచుకున్నారని ఒక అంచనా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్ గా నిలపడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. షీల్డ్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటిసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ (Telangana) సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్ (Cyberabad Police), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ను అభినందించారు. డిజిటల్ సేఫ్టీ, ఫ్యూచర్ గురించి చర్చించేందుకు  షీల్డ్ 2025 (SHIELD Conclave) వేదికగా మారింది. తెలంగాణను నంబర్ 1 సైబర్-సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు పనిచేస్తున్న మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 
1930 నంబర్ గుర్తుంచుకోండి
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రస్తుత కాలంలో ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు. ఇది పౌరులకు, ఆర్థిక వ్యవస్థకు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో గందరగోళం ఏర్పడుతుంది. సైబర్ సెక్యూరిటీ (Cyber Security) సొల్యూషన్స్ కోసం ఎకో సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిపుణులు, ఐటీ సంస్థలతో కలిసి పనిచేసేందుకు, అన్ని రకాల వనరులు ప్రభుత్వం సమకూరుస్తోంది. దాంతో తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్ గా మార్చాల్సిన అవసరం ఉంది. 1930 నంబర్ ను అందరికీ షేర్ చేయండి. ఇది సైబర్ నేరాలకు సంబంధించిన 24/7 హెల్ప్‌లైన్. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, పౌరులను రక్షించడానికి సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి. 

Continues below advertisement


అత్యంత కీలక సదస్సు షీల్డ్ 2025

నేరాల విధానం వేగంగా మారుతోంది కనుక షీల్డ్ 2025 అత్యంత కీలక సదస్సు. సమాజంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని రకాల ప్లాన్స్ సిద్ధం చేయాలి. సైబర్ క్రైంను నియంత్రించడంలో దేశంలోనే మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. కానీ సైబర్ నేరాలను అరికట్టేందుకు సంబంధిత విభాగాలను బలోపేతం చేయాలి. నేరం జరిగిన తరువాత పట్టుకోవడం కాదు.. నేరం జరగకుండా, సైబర్ నేరాలు జరగకుండా నిరోధించగలగాలి. ఫేక్ న్యూస్ తో పాటు ఆర్థిక నేరాలను నిరోదించాలి. సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా మార్చుతాం.

గత ఏడాది 7 కొత్త ప్రత్యేక సైబర్ క్రైమ్ (Cybercrime) పోలీస్ స్టేషన్‌లను ప్రారంభించాం. వీటి ఏర్పాటుతో సేవలు అందిస్తున్నడీజీపీ, సైబర్ బ్యూరో డైరెక్టర్‌ని అభినందిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు TG- CSB బృందానికి అభినందనలు. మన రాష్ట్రాన్ని సైబర్ సేఫ్ స్టేట్ గా మార్చేందుకు అంతా కలిసి పనిచేద్దామని’ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈజీ మనీ కోసం చూడకుండా సొంతంగా కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే లోన్ యాప్స్ సమస్యలు తీరతాయని సూచించారు. నగదు ప్రైజ్, కోట్ల లాటరీ అని మెస్సేజ్‌లు వస్తే అలాంటి లింక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని ప్రజలకు సూచించారు.

Also Read: Telangana News: మూడు నెలలు అత్యంత కీలకం- సాగు, తాగునీటిపై తెలంగాణ ఫోకస్, టెలిమెట్రీపై ముందుకు రాని ఏపీ

Continues below advertisement