Telangana CM Revanth Reddy: డీఎస్సీ 2024 ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పరిస్థితులు ఖాళీలు చూసుకొని డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియ అనేది నిరంతరం సాగేది అన్నారు రేవంత్ రెడ్డి.
ఇప్పుడు డీఎస్సీ ప్రక్రియ నియామక ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇందులో ఉన్న మిగిలిపోయే ఖాళీలు, కొత్తగా ఏర్పడే ఖాళీలు తెప్పించుకొని డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కచ్చితంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు నియామకాలు జరుగుతాయన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఏ ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా భర్తీ చేస్తామని అన్నారు. త్వరలోనే గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా ఇస్తామన్నారు.
గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసింది కానీ అక్కడ కనీస వసతులు కల్పించడంలో పూర్తి ఫెయిల్ అయిందన్నారు రేవంత్ రెడ్డి. పిట్టగూళ్లలో, పౌల్ట్రీ ఫామ్‌లో పేదల పిల్లలను వదిలేశారని ఆరోపించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నామని రేవంత్ ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలల్లో ఈ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనార్టీ విద్యార్థులను ఒకే చోట విద్యను అందించబోతున్నామని తెలిపారు. యూనివర్శిటీ స్థాయిలో ఈ రెసిడెన్సియల్ స్కూల్స్ ఉంటాయని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద ముందుగా కొడంగల్, మధిరలో ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనట్టు పేర్కొన్నారు.