Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Telangana Ration Card Latest News : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం కానుంది. పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Continues below advertisement

Telangana Ration Card Latest News : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ అంశంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉన్నందున మిగతా జీల్లాల్లో కొత్త రేషన్ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

Continues below advertisement

వివిధ మార్గాల్లో లక్షల మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం మీ సేవ కేంద్రాల ద్వార కూడా ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే నిత్యం అప్లికేషన్లు పెట్టడమే జరుగుతోందని ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్న ప్రచారం ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లో ప్రజాపాలన పేరుతో భారీగా దరఖాస్తులు తీసుకున్నారు. వాటి ఆధారంగానే కొన్ని పథకాలు అమలు చేశారు. కానీ రేషన్ కార్డులు మాత్రం ఇవ్వలేకపోయారు. 

తెలంగాణ వచ్చిన ఇన్నేళ్లు అవుతున్నా కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ఇంత వరకు అతీ గతీ లేదనే విమర్శ ఉంది. 

Also Read: మీకు రేషన్ కార్డు లేదా? తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డుల జారీ చేసేది ఎప్పుడంటే..

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతి సారి వివిధ రూపంలో ప్రజల నుంచి దరఖాస్తులు మాత్రం తీసుకుంటూ వచ్చింది. ప్రజాపాలన పేరుతో మొదట్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు తీసుకున్నారు. తర్వాత గ్రామ సభలు నిర్వహించి అప్లికేషన్లు తీసుకున్నారు. కులగణన పేరుతో కూడా రేషన్ కార్డు గురించి కాలమ్‌ పెట్టారు. ఇలా వివిధ సందర్భాల్లో దరఖాస్తులు చేసుకున్నారు ప్రజలు. 

అర్హుల జాబితా అని గ్రామాల్లో కొందరు పేర్లు ప్రకటించారు. ఇంకా దరఖాస్తు చేసుకోనివారు వేర్వేరు కారణాలతో అర్హులై ఉండి అప్లికేషన్ రిజెక్ట్ అయిన వాళ్లు కూడా మళ్లీ అప్లై చేసుకోవాలని ప్రభుత్వ సూచించింది. వాళ్లంతా మీ సేవ కేంద్రాలకు వెళ్లి అప్లై చేసుకోవాలని హితవు చెప్పింది. దీంతో మీ సేవ కేంద్రాల్లో జనం బారులు తీరారు. 

అయితే పేర్లు నమోదు చేసుకోవడం, జాబితాలు ప్రకటించడమే తప్ప కార్డులు మాత్రం జారీ ఆలస్యమవుతుందని ప్రచారం జరిగింది. ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలు కాకుండా వేరే జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు రేవంత్ రెడ్డి. కోడ్‌ అమలులో లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త రేషన్ కార్డులు ఎలా ఉండాలనే ఆలోచన చేయాలని అధికారులను సూచించారు. రేషన్ కార్డులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి ప్రక్రియను వేగవంతం చేసేలా ఆదేశాలు ఇచ్చారు.  

Also Read: తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, టికెట్ ధరలపై ఆర్టీసీ డిస్కౌంట్

Continues below advertisement