తెలంగాణ కేబినెట్‌ (Telangana Cabinet )సమావేశం ఉదయం పదకొండున్నరకు జరగనుంది. స్పీకర్ ఎన్నిక (Speaker Election ) ముగిసిన తర్వాత అసెంబ్లీ ( Assembly ) ఆవరణలోనే కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief secratary ) శాంతికుమారి (Shanthi kumari )మంత్రుల (Ministers )కు సమాచారం పంపారు. మరోవైపు పార్లమెంట్‌లో జరిగిన ఘటన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, మండలి ఛైర్మన్‌, ప్రొటెం స్పీకర్‌, పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఇప్పటి వరకు జారీ చేసిన పాసులు తప్ప అన్నింటినీ నిలిపివేయాలని ప్రొటెం స్పీకర్‌ ఆదేశించారు.


తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. బుధవారం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్‌కుమార్‌ ఎన్నిక లాంఛనమే కానుంది. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో స్పీకర్‌ ఎన్నికపై ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటన చేయనున్నారు. శాసనసభ కార్యదర్శికి బుధవారం ఉదయం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ప్రసాద్‌కుమార్‌ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్‌ పత్రాలపై కేటీఆర్‌ సంతకం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడ్డం ప్రసాద్‌కుమార్‌ రెండుసార్లు వికారాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ పని చేశారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్‌ అవుతారు. గడ్డం ప్రసాద్‌ కుమార్‌ స్వస్థలం వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం బెల్కటూరు గ్రామం. తల్లిదండ్రులు ఎల్లమ్మ, ఎల్లయ్య.  తాండూర్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.