Telangana Budget 2025 Live updates | తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ 2025-26 ప్రవేశపెట్టారు. 2025-26 బడ్జెట్ అంచనాలు ఇలా ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు (3 లక్షల 4 వేల 965 కోట్ల రూపాయలు) కాగా, రెవెన్యూ వ్యయం 2,26,982 , మూలధన వ్యయం రూ. 36,504 కోట్లు అని భట్టి విక్రమార్క వెల్లడించారు. పారదర్శకత, జవాబుదారీతనంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని అటు అభివృద్ధితో పాటు ఇటు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాం అన్నారు. శాసనమండలిలో శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 

తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP)  16,12,579 కోట్లు. గత ఏడాదితో పోల్చితే 10.1 శాతం వృద్ధిరేటు నమోదైంది. దేశ జీడీపీ 3 కోట్ల 31 లక్షల 3 వేల 215 కోట్ల రూపాలు కాగా, వృద్ధిరేటు 9.9 శాతం. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,79,751 (3 లక్షల 79 వేల 751 రూపాయలు ) కాగా, వృద్ధిరేటు 9.6 శాతం. దేశ తలసరి ఆదాయం రూ.2,05,579, కాగా వృద్ధిరేటు 8.8 శాతం. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,74,172 ఎక్కువగా ఉంది.

తెలంగాణ బడ్జెట్ సమగ్ర స్వరూపం..

తెలంగాణ వార్షిక బడ్జెట్‌ 2025  -  రూ.3,04,965 రెవెన్యూ వ్యయం   -  రూ.2,26,982 కోట్లుమూలధన వ్యయం   -  రూ.36,504 కోట్లు 

శాఖలవారీగా కేటాయింపులు ఇలా..పౌరసరఫరాల శాఖ   -  రూ.5,734 కోట్లువ్యవసాయ శాఖ   -  రూ.24,439 కోట్లు. విద్యా రంగం   -  రూ.23,108 కోట్లుపశు సంవర్ధకం   -  రూ.1,674 కోట్లుపంచాయతీరాజ్‌ శాఖ   -  రూ.31,605 కోట్లు కార్మిక శాఖ   -  రూ.900 కోట్లు మహిళా, శిశు సంక్షేమశాఖ   -  రూ.2,862 కోట్లుబీసీల సంక్షేమం   -  రూ.11,405 కోట్లుఎస్టీల సంక్షేమం   -  రూ.17,169 కోట్లుఎస్సీల సంక్షేమం   -  రూ.40,232 కోట్లు మైనార్టీ సంక్షేమం   -  రూ.3,591 కోట్లుచేనేత రంగం   -  రూ.371 కోట్లుఐటీ రంగం   -  రూ.774 కోట్లుపరిశ్రమల శాఖ   -  రూ.3,527 కోట్లునీటిపారుదల శాఖ   -   రూ.23,373 కోట్లుఅర్బన్ డెవలప్‌మెంట్ శాఖ   -   రూ.17,677 కోట్లుHyderabad సిటి డెవలప్మెంట్ - రూ.150 కోట్లురోడ్లు భవనాల శాఖ   -   రూ.5907 కోట్లుహోం శాఖ   -   రూ.10,188 కోట్లు అడవులు, పర్యావరణ శాఖ   -  రూ.1,023 కోట్లుదేవాదాయ శాఖ   -  రూ.190 కోట్లు  యువజన సేవలు  -  రూ.900 కోట్లుపర్యాటకం   -  రూ.775 కోట్లుసమాచార సాంకేతికత  -  రూ.774క్రీడలు  -  రూ.465చేనేత  -  రూ.371 

బడ్జెట్ స్పీచ్ లైవ్ ఇక్కడ చూడండి

అంతకుముందు బుధవారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బడ్జెట్ 2025-26 ప్రతులను ఉపముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అందించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వార్షిక బడ్జెట్ ప్రతులను అందజేశారు. భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిల్లా శ్రీధర్ బాబు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు బడ్జెట్ ప్రతులను సమర్పించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సైతం భట్టి విక్రమార్క మల్లు, శ్రీధర్ బాబు తదితరులు బడ్జెట్ కాపీలు అందజేశారు. అంతకుముందు తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26 ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అనంతరం అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ కాపీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఛీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , స్పెషల్ సెక్రెటరీ రామకృష్ణ రావు , సందీప్ కుమార్ సుల్తానీయ , తదితరులు పాల్గొన్నారు.