Flight simulators for fighter jets:   తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణల కోసం సిద్ధం చేిసన    T-Works, హైదరాబాద్‌లోని Axial Aero Private Limited సంస్థ సహకారంతో యుద్ధ విమానాలు, ప్యాసింజర్ విమానాలు, హెలికాప్టర్లకు అధునాతన ఫుల్ మోషన్ ఫ్లైట్ సిమ్యులేటర్ల తయారీకి సిద్ధమవుతోంది. ఈ కొత్త తయారీ యూఎస్, యూరప్‌ల నుంచి ఖరీదైన దిగుమతులను తగ్గించి, భారత డిఫెన్స్ వ్యవస్థల ఖర్చును ప్రధానంగా తగ్గించేలా చేస్తుంది. ఇది హైదరాబాద్‌ను అధునాతన డిఫెన్స్ టెక్నాలజీల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా మార్చే ప్రధాన లక్ష్యంగా ఉంది. IT , పరిశ్రమల మంత్రి  శ్రీధర్ బాబు ఇటీవల T-Worksకు  వెళ్లి ఈ ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించారు.
  
T-Works, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన హార్డ్‌వేర్ ఇన్నోవేషన్ కేంద్రం, ఇప్పుడు డిఫెన్స్ రంగంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ కేంద్రం Axial Aero Private Limitedతో కలిసి నెక్స్ట్-జెనరేషన్ ఫుల్ మోషన్ ఫ్లైట్ సిమ్యులేటర్ల అభివృద్ధికి  సిద్ధం అయింది.  ఈ సిమ్యులేటర్లు పైలట్ల శిక్షణకు కీలకం. అధునాతన ఎలక్ట్రానిక్, ఆటోమేటెడ్ సిస్టమ్‌లు, అర్ధ-వృత్తాకార స్క్రీన్‌లతో డైనమిక్ విజువల్స్‌ను ప్రదర్శిస్తాయి. 

Continues below advertisement


 దిగుమతి సిమ్యులేటర్లు 30 డిగ్రీల వరకు మాత్రమే టిల్ట్, రొటేట్ చేస్తే, ఈ హైదరాబాద్ తయారీలు 360-డిగ్రీ స్ట్యూవర్ట్ ప్లాట్‌ఫారమ్‌పై మౌంట్ చేయవచ్చు.    ఇది యుద్ధ విమానాలు, ప్యాసింజర్ విమానాలు, హెలికాప్టర్లకు అనుకూలంగా ఉంటుంది. పరిశోధన, అభివృద్ధి (R&D) త్వరగా పూర్తి చేసి, పెద్ద ఆర్డర్లు సాధించిన ఈ టీమ్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. త్వరగా ఉత్పత్తి ప్రారంభించాలని, హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా ఏర్పరచాలని సూచించారు.
 
ఈ సిమ్యులేటర్ల తయారీ భారత డిఫెన్స్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ప్రస్తుతం యూఎస్, యూరప్‌ల నుంచి దిగుమతి చేసుకునే సిమ్యులేటర్లు ఖరీదైనవి, ఇవి భారత వాయుసేన (IAF) శిక్షణ బడ్జెట్‌పై భారం. స్థానిక తయారీతో ఈ ఖర్చులు తగ్గడమే కాకుండా, సహాయక పరిశ్రమలు, MSMEలకు కొత్త అవకాశాలు వస్తాయి.  హైదరాబాద్‌లోని T-Worksలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది, ఇది డిఫెన్స్ టెక్నాలజీల్లో భారతదేశాన్ని స్వయం సమృద్ధి  వైపు ముందుకు తీసుకెళ్తుంది.



ఇది HAL Tejas వంటి స్వదేశీ యుద్ధ విమానాల శిక్షణకు కూడా మేలు చేస్తుంది. HAL, భారత వాయుసేనకు Tejas తయారు చేస్తున్నది.  . హైదరాబాద్ ఇప్పటికే ఏరోస్పేస్ రంగంలో కీలక హబ్ గా మారింది.  Tata Advanced Systems వంటి సంస్థలు ఇక్కడే ఉన్నాయి.  తెలంగాణ ప్రభుత్వం T-Worksను డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చాలని కోరుకుంటోంది.