New Year 2026: కొత్త సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, మాదక ద్రవ్యాల ఊసే లేకుండా సాగాలని హైదరాబాద్‌పోలీసులకు సీపీ గట్టి టాస్కే ఇచ్చారు. అందుకే రోజుకో విభాగంతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎక్కడా పొరపాటు లేకుండా వేడుకలకు ఆంటంకం లేకుండా సాగడంతోపాటు పోలీసుల నిర్లక్ష్యంగా ఉన్నారనే మాట రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జీరో డ్రగ్స్ విధానమే లక్ష్యంగా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నామని హెచ్చరిస్తున్నారు. 

Continues below advertisement

హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ సజ్జనార్‌ బంజారా హిల్స్‌లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో మరోసారి సమీక్ష నిర్వహించారు. వివిధ పోలీసు విభాగాల అధికారులతో మాట్లాడిన ఆయన శుక్రవారం నుంచి తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఏ రూపంలో కూడా డ్రగ్స్‌ వాడకాన్ని టోలరేట్ చేసేది లేదని స్పష్టం చేశారు. పబ్‌లు, రెస్టారెంట్‌లు, హోటల్స్‌, న్యూ ఇయర్ ఈవెంట్స్‌ నిర్వహించే ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రత్యే బృందాలతో నిఘా ఉంచాలని సూచించారు.

కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించే ప్రత్యేక ప్రదేశాలతోపాటు ప్రైవేటుగా నిర్వహించే ప్రాంతాల్లో కూడా నిఘా పెట్టాలని సూచించారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌లు, హాస్టల్స్‌పై కన్నేయాలని ఆదేశించారు. రెండేళ్లుగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలతో సంబంధాలు కలిగిన వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని వారి కదలికలను నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే డ్రగ్స్ తీసుకుంటూ, అమ్ముతూ పట్టుబడిన వారి జాబితా ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని యువత ఆ జోలికి వెళ్లొద్దని సూచించారు. హస్టల్స్‌లో చదువుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడ పార్టీ జరుగుతోంది? ఎలాంటి పరిస్థితుల్లో పార్టీ జరుగుతోందో కాస్త అలర్ట్‌గా ఉండాలని ప్రజలకు సీపీ సూచించారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. మీ పరిసర ప్రాంతాల్లో అనుమానితుల వివరాలను పోలీసులకు చేరవేయాలని పిలుపునిచ్చారు.  

Continues below advertisement

31నైట్ కూడా ప్రజలతోపాటు ఈవెంట్ ఆర్గనైజర్‌లు చాలా జాగ్రత్తగా ఉండాలని సీపీ హెచ్చరించారు. రాత్రి ఒంటిగంట కల్లా అన్నింటినీ క్లోజ్ చేయాలని సూచించారు. ఎవరైనా అంతకు మించిన ఈవెంట్స్ నిర్వహించిన పబ్‌లు, రెస్టారెంట్స్‌ ఓపెన్ చేసినా ఉంచినా కేసులు రిజిస్టర్ చేస్తామని చెప్పారు. చెప్పిన రూల్స్‌ను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని అన్నారు. కేసులు పెట్టడమే కాకుండా లైసెన్స్ కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 

ట్రాఫిక్‌పై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సీపీ వివరించారు. రెగ్యులర్‌గా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నామని అన్నారు. చెక్‌పెస్టులు, బ్యారికేడ్‌లు సిద్ధం చేసి నియంత్రిస్తామని అన్నారు. జనాలు కూడా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా వేడుకలు జరుపుకోవాలని ప్రజలు హితవుపలికారు