తెలంగాణ శాసన మండలిలో ఐదుగురు ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీల్లో బండా ప్రకాష్ కాకుండా, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రమి రెడ్డి, చేత మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. అయితే, బండా ప్రకాశ్ తన రాజ్యసభ సభ్యత్వ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఇటీవల శాసన మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల ఎన్నికను గుర్తిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
గత జూన్ 3న ఆరుగురు ఎమ్మెల్యే కోటా శాసన మండలి సభ్యుల పదవీ కాలం ముగిసింది. అయితే, వారి స్థానంలో నవంబర్ 22న ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారి గతంలోనే ధ్రువీకరణ పత్రం అందించారు. ప్రజాప్రాతినిథ్యం చట్టంలోని నిబంధనల మేరకు వీరు ఎన్నికైనట్లు గెజిట్ విడుదలైంది.
ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎన్నికైన వారిలో కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కల్లపల్లి రవీందర్‌రావు, పరుపాటి వెంకట్‌రాంరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, బండా ప్రకాశ్ ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని గతంలో గవర్నర్ కోటాలో మండలికి పంపాలని ప్రయత్నించినా అది సాధ్యం కాని సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం రాలేదు. దీంతో తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు.
మరోవైపు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ మండలికి ఎన్నికైన నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవాలి. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన 14 రోజుల్లో రాజ్యసభకు రాజీనామా చేయాలని నిబంధన ఉంటుంది. నేడు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బండా ప్రకాశ్ చెప్పారు.
Also Read : వాహన రిజిస్ట్రేషన్లనూ వదల్లేదు... నకిలీ బీమా పాలసీలతో ప్రభుత్వ ఆదాయానికి గండి..
గవర్నర్ కోటాలో ఎన్నికైన మధుసూధనాచారితోపాటు, ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన బండా ప్రకాశ్ ఈ నెల 6 తర్వాత ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఉన్న 12 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం 2021 జనవరి 4న ముగియనుంది. ఈ 12 స్థానాలకుగాను ఇప్పటికే ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మరో ఆరు స్థానాలకు ఈ నెల 10న పోలింగ్ జరగనుంది.
Also Read : అనంతపురంలో యువతి హత్య.. గర్భిణీగా తేల్చిన పోలీసులు, విచారణలో సంచలన విషయాలు
Also Read : బుల్లెట్టు బండెక్కి వచ్చాడు.. సూసైడ్ లెటర్ రాసి పోయాడు.. ఇంతలోనే మతిపోగొట్టే ట్విస్ట్!
Also Read : వాహన రిజిస్ట్రేషన్లనూ వదల్లేదు... నకిలీ బీమా పాలసీలతో ప్రభుత్వ ఆదాయానికి గండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి