KTR Phone Tapping Case : తెలంగణలో రాజకీయ రణరంగానికి కారణమైన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తన్నారు. బుధవారం హరీష్‌రావును విచారించిన సిట్‌ గురువారం కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అధికారుల ఆదేశాల మేరకు ఈ ఉదయం జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి కేటీఆర్ హాజరయ్యారు. 

Continues below advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను సిట్ బృందం వివిధ అంశాలపై ప్రశ్నలు వేస్తోంది. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఆధారంగా ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇది వరకే అధికారులు, ప్రజా ప్రతినిధులను సిట్ బృందం ప్రశ్నించింది. వారి నుంచి వాంగ్మూలాలను సేకరించింది. వాటి ఆధారంగానే కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఈ విచారణలో ఇద్దరు అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆయన్ని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఉదయం నందిహిల్స్ నుంచి హరీష్‌రావుతో కలిసి కేటీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. అక్కడ ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మహిళా నేతలు ఆయనకు తిలకం దిద్ది ఆశీర్వదించారు. అనంతరం ఆయన ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. తననే టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుష్ప్రచారం చేస్తోందని ఇప్పుడు జరుగుతున్నది అదేనంటూ విమర్శలు చేశారు. 

Continues below advertisement

మీడియా సమావేశం తర్వాత హరీష్‌రావుతో కలిసి సిట్ కార్యాలయానికి కేటీఆర్ వచ్చారు. చాలా దూరంలో అందరి వాహనాలను పోలీసులు ఆపేశారు. కేవలం కేటీఆర్ హరీష్‌ రావు వాహనాలను పీఎస్‌ వరకు అనుమతి ఇచ్చారు. పీఎస్‌ వరకు హరీష్‌రావుతో వచ్చిన కేటీఆర్ ఒక్కడినే విచారణకు అనుమతి ఇచ్చారు. 

విచారణ జరుగుతున్న టైంలోనే జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. తమను అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ముందే తమను తమ నేతలను అడ్డుకోవడంపై మండిపడ్డాయి. అయినా పోలీసులు వారిని నియంత్రించి అక్కడి నుంచి పంపేశారు. ఇలాంటివి జరుగుతాయని ముందే గ్రహించిన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విద్యార్థు నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని పలువురు లీడర్లను ఇంటి నుంచి రానీయలేదు.