తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం వేగంగా మారబోతోంది. మార్చి 15 వరకు ఎండ తీవ్రత కొనసాగి, పొడి వాతావరణం ఉన్నప్పటికీ, ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం నాడు వర్షాలు మొదలైనప్పటికీ మార్చి 16 నుండి 20 మధ్య రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్‌లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు (Hailstorms) కురిసే అవకాశం ఉంది.
మార్చి 17, 18, 19 తేదీల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉండనుంది. ఈ అకాల వర్షాల కారణంగా ఈ ఏడాది ఉగాది, రంజాన్ వేడుకలు వర్షంలోనే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడవచ్చు.
2023లో మార్చి 16-19 తేదీలో తెలంగాణలో కురిసిన భారీ వడగళ్ల వానలు మనందరికీ గుర్తే ఉంటాయి. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ప్రజలను ఇబ్బంది పెట్టింది. సరిగ్గా మూడేళ్లకు అదే తరహా పరిస్థితులు రిపీట్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్చి 15 నుండి తెలంగాణతో పాటు హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈసారి కూడా తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలున్నాయి. భారీ వడగళ్ల వానలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందో తెలిపే 'ఇంపాక్ట్ మ్యాప్' ఆదివారం విడుదల కానుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వాతావరణ సమాచారంతెలంగాణ:రాష్ట్రంలో రాబోయే 48 గంటల్లో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా తగ్గి, మేఘావృతమైన వాతావరణం ఏర్పడనుంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వడగళ్ల వానల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. హైదరాబాద్ నగరంలో నేటి సాయంత్రం నుండి వాతావరణంలో మార్పులు మొదలయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్:కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణకు ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర తీర ప్రాంతాల్లో గాలి వేగం పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సోమవారం నుంచి ఉరుములు, మెరుపులతో వర్షాలు.. పిడుగులకు ఛాన్స్
తెలంగాణలో మార్చి 16-20 తేదీల మధ్యలో చాలా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వెదర్ మ్యాన్ తెలిపారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గరిష్ట తీవ్రత తెలంగాణ లో మార్చి 18-19 తేదీలలో ఉండబోతుందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
.రైతులు తమ పంటలను వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలు నుండి కాపాడుకోవాల్సి ఉంటుంది. తమ పంటలను godown, cold storage units లో భద్రపరచుకోవాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో పిడుగులు సైతం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కనుక వర్షం కురిసే సమయంలో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని.. వర్షాలతో పాటు ఈదురుగాలులు ఉంటాయన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.
