హైదరాబాద్ కు కొత్త పోలీస్ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య నియమితులు అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సందీప్ శాండిల్య శనివారం నాడు (అక్టోబరు 14) బాధ్యతలు తీసుకోనున్నారు. కొన్నాళ్ల క్రితం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆయన పని చేశారు.
వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. అలా తెలంగాణలో కూడా వివిధ ప్రాంతాలకు చెందిన కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఐపీఎస్ అధికారులు బదిలీ చేశారు. బదిలీ అయినవారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు ఉన్నారు. ఇందులో తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లతోపాటు 13 మంది పోలీసు అధికారులు ఉన్నారు.
వరంగల్ సీపీగా అంబర్ కిషోర్ ఝా
వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ ఏవీ రంగనాథ్ ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా.. ఆయన స్థానంలో అంబర్ కిషోర్ ఝాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. అంబర్ కిషోర్ ఝా గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూరల్ ఎస్పీగా పని చేశారు.
భూపాలపల్లి ఎస్పీగా ఖారే కిరణ్ ప్రభాకర్
భూపాల్ పల్లి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న పుల్ల కర్ణాకర్ ను ఈసీ బదిలీ చేయగా.. ఆయన స్థానంలో 2017 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన ఖారే కిరణ్ ప్రభాకర్ ను నూతన ఎస్పీగా నియమించింది. ఖారే కిరణ్ ప్రభాకర్ హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు.
ఐపీఎస్‌లు వీరే..
నిజామాబాద్ పోలీసు కమిషనర్ - కల్మేశ్వర్
నాగర్ కర్నూల్ ఎస్పీ - వైభవ్ రఘునాథ్
సంగారెడ్డి ఎస్పీ - చెన్నూరి రూపేష్
జోగులాంబ గద్వాల్ ఎస్పీ - రితిరాజ్
జగిత్యాల ఎస్పీ - సంప్రీత్ సింగ్
మహబూబాబాద్ ఎస్పీ - పాటిల్ పంగ్రామ్‌సింగ్ గణపతిరావ్
నారాయణపేట్ ఎస్పీ - యోగేష్ గౌతమ్
కామారెడ్డి ఎస్పీ - సింధూ శర్మ
మహబూబ్‌నగర్ ఎస్పీ - హర్ష వర్థన్
భూపాలపల్లి ఎస్పీ - కిరణ్ ప్రభాకర్
సూర్యాపేట ఎస్పీ - రాహుల్ హెగ్డే