Molesting Female Software Engineer | హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సెక్యూరిటీ గార్డ్ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఐటీ సెక్టార్‌లో కలకలం రేపుతోంది. ఇందిరానగర్‌లో క్యాబ్ ఎక్కుతున్న 24 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఓ సెక్యూరిటీ గార్డు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ మహిళా టెకీ ఆఫీసుకు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతుండగా సెక్యూరిటీ గార్డు ఆమెను పక్కకు లాగి బలవంతంగా ముద్దు పెట్టాడు.
ఈ ఊహించని ఘటనతో దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు బిగ్గరగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు వెంటనే గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.
పారిపోయిన నిందితుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్‌గా గుర్తించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, టెక్నాలజీ సాయంతో అతడిని అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.
