Wine Shops Closed in Secunderabad | హైదరాబాద్: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకుని నగరంలో 2 రోజుల పాటు మద్యం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల పరిరక్షణ, లష్కర్ బోనాలు ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు ఆగస్టు 2వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

Continues below advertisement

మార్కెట్, గోపాలపురం పీఎస్ పరిధిలో బంద్ఈ ఆంక్షలు ప్రధానంగా మల్కాజిగిరి జోన్ పరిధిలోని మార్కెట్, గోపాలపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో అమల్లో ఉంటాయి. ఈ ప్రాంతాల్లోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను నిర్దేశిత సమయంలో పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది. బోనాల వేడుక సజావుగా సాగేందుకు మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

అట్టహాసంగా లష్కర్ బోనాల ఏర్పాట్లుసికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరకు వేళయింది. చారిత్రక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు సికింద్రాబాద్‌లోని ప్రధాన ఆలయాలన్నీ విద్యుత్ దీపాల కాంతులతో, రంగు రంగుల అలంకరణలతో శోభాయమానంగా ముస్తాబయ్యాయి. ఆగస్టు 2, 3 తేదీల్లో ఎంతో వైభవంగా జరగనున్న ఈ బోనాలకు సుమారు 25 నుండి 30 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ప్రభుత్వం, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు.

Continues below advertisement

Also Read: Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?

కట్టుదిట్టమైన భద్రత, భక్తులకు మౌలిక వసతులుసికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో తాత్కాలిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచనున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఆరు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 2 బోనాలు సమర్పించే భక్తులకు, రెండు సాధారణ దర్శనాలకు, మరో రెండు వీఐపీ దర్శనాలకు కేటాయించారు. అలాగే, భక్తుల దాహార్తిని తీర్చేందుకు జలమండలి ఆధ్వర్యంలో 5 తాగునీటి కేంద్రాలను, అత్యవసర వైద్య సేవల కోసం వైద్య ఆరోగ్య శాఖ 3 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది.