హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్‌లో తెలంగాణ కాంగ్రెస్ నిరసన దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఈ నిరసన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి ప్రముఖ వ్యక్తికి పాదాభివందనం చేశారు.
హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన 92 ఏళ్ల రాం రెడ్డి రైతుల సమస్యలు, శాశ్వత పరిష్కారంపైన అద్భుతమైన పాట పాడారు. దానికి స్పందించిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనను అభినందించి, సత్కరించి వేదిక మీద పాదాభివందనం చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా వేదికపై ఆయన్ను సత్కరించారు. రాంరెడ్డిని ఇద్దరు ఎంపీలు ఆలింగనం చేసుకున్నారు. తాను రాసిన పాటను ముద్రించి పంచి పెడతామని సభకు అధ్యక్షత వహించిన టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.
Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి
మరోవైపు, ఈ నిరసనకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం నిరసన వేదిక వద్దకు చేరుకొన్నారు. రైతుల విషయంలో కేసీఆర్ కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘చేనుకు చీడ పడితే ఏం చేయాలో రైతుకు తెలుసు. కేసీఆరే రైతుకు పట్టిన పెద్ద చీడగా మారిండు. కల్లాల్లో ఎలాంటి వసతులు లేవు. ఇసుక లారీలను పది రోజులు ఆపితే వరి ధాన్యం ట్రాన్స్ పోర్ట్ చేయొచ్చు.
ఢిల్లీకి వెళ్లి తేల్చుకు వస్తా అన్న కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో మలుచుకుని పన్నడు. ఢిల్లీకి వెళ్లి వచ్చాక ఏం జరిగిందో ఎందుకు చెప్పడం లేదు. కేసీఆర్‌ను పోతం పెట్టడానికి రైతులు సిద్ధంగా ఉన్నరు. రైతులు ఏం పంట వేయాలో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ రైతు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టె ప్రయత్నం చేస్తున్నాడు. వర్షాకాలం పంట, యాసంగి పంట రెండు కొనాలి. రైతుల కోసం ఎక్కడి దాకైనా కొట్లాడుతాం.’’ అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
Also Read: Kondapur: సెప్టిక్ ట్యాంకులోకి దిగిన కూలీలు.. లోపలే ఇద్దరు దుర్మరణం, కారణం ఏంటంటే..
Also Read: Adilabad: హాస్టల్‌లో భూతం! ఒంటిపై రక్కుతూ, వింత అరుపులు.. అసలేం జరిగిందంటే..