Removal of the cycling track became controversy: బీఆర్ఎస్ హయాంలో నానక్ రాం గూడ దగ్గర ఔటర్ రింగ్ పక్కన బిజీ ఏరియాలో సైక్లింగ్ ట్రాక్ ను నిర్మించారు. ఇరవై కిలోమీటర్ల మేర ఈ సైక్లింగ్ ట్రాక్ ఉంది. అయితే ఉదయం నుంచి కొంత మంది బీఆర్ఎస్ సానుభూతిపరులు సైక్లింగ్ ట్రాక్ ను తొలగిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. దానికి మద్దతుగా ఓ వీడియోను కూడా షేర్ చేశారు. కాసేపటికే ఆ వీడియో వైరల్ అయింది. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని సైక్లింగ్ ట్రాక్ ను నిర్మించారని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టి కూల్చేస్తోందని ఆరోపించారు.
అయితే ఇది వివాదంగా మారడంతో అధికారులు, పోలీసులు క్లారిటీ ఇచ్చారు. నానక్ రాం గూడ వైపు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నందున 30 మీటర్ల సైక్లింగ్ ట్రాక్ ను మాత్రమే తొలగిస్తున్నట్లుగా స్పష్టత ఇచ్చారు.
అనూహ్యంగా ఈ సైక్లింగ్ ట్రాక్ మొత్తాన్ని తీసేయాలని నెటిజన్లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. నానక్ రామ్ గూడ వైపు వెళ్లే వాళ్లకు ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సైక్లింగ్ ట్రాక్ అడ్డంగా ఉంటుంది. పైగా ఆ సైక్లింగ్ ట్రాక్ లో సైక్లింగ్ చేసేవాళ్లు దాదాపుగా ఉండరు. నిరుపయోగంగా ఉంటుంది. అందుకే దాన్ని తొలగించాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపించింది.
చాలా దేశాల్లో ఇలా రోడ్ల పక్కన సైక్లింగ్ ట్రాక్‌లు ఉంటాయి. కానీ అవి అబివృద్ధి చెందిన దేశాలు అక్కడి ప్రజుల సైక్లింగ్ ను ఇష్టపడతారు. సైకిల్స్ మీద ఆఫీసులకు వెళ్లేలా పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అలాంటి పరిస్థితి లేకపోవడంతో.. ఆ సైక్లింగ్ ట్రాక్ వృధాగా మారింది. సోలార్ రూఫ్ టాప్‌తో ఖరీదుగా దాన్ని నిర్మించారు.