Mahesh Bank Fined: మహేశ్‌ బ్యాంక్‌కు RBI భారీ జరిమానా, దేశంలో ఇదే మొదటిసారి

RBI penalises AP Mahesh co-op bank: ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ మహేశ్ బ్యాంక్, హైదరాబాద్ కు ఆర్బీఐ భారీ షాకిచ్చింది. ప్రైవేట్ బ్యాంక్‌కి ఆర్బీఐ జరిమానా విధించడం దేశంలో ఇదే మొదటిసారి. 

Continues below advertisement

RBI penalises AP Mahesh co-op bank: హైదరాబాద్: ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ మహేశ్ బ్యాంక్, హైదరాబాద్ కు ఆర్బీఐ భారీ షాకిచ్చింది. మహేశ్ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) ఏకంగా రూ.65 లక్షల ఫైన్ విధించింది. సెబర్ సెక్యూరిటీ నిబంధనలను అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ వింగ్ దర్యాప్తులో తేల్చింది. దీంతో మహేశ్ బ్యాంకుపై ఆర్బీఐ రూ.65 లక్షల ఫైన్ విధించింది. ప్రైవేట్ బ్యాంక్‌కి ఆర్బీఐ జరిమానా విధించడం దేశంలో ఇదే మొదటిసారి. 

Continues below advertisement

సెబర్ సెక్యూరిటీ నిబంధనలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జరిమానా విధించినట్లు తెలుస్తోంది. గత ఏడాది హ్యాకర్ల ముఠా హ్యాక్ చేసి రూ.12.48 కోట్లను బ్యాంకు ఖాతా నుంచి స్వాహా చేశారు. దీనిపై హైదరాబాద్ సైబర్ విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆర్బీఐకి నివేదిక అందించారు. అన్ని వివరాలు పరిశీలించిన ఆర్బీఐ.. మహేశ్ బ్యాంకుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సైబర్ సెక్యురిటీ ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. 

అసలేం జరిగిందంటే..
2022 జనవరి 24న ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంకు, హైదరాబాద్ అకౌంట్లను నైజీరియా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. బ్యాంకు సర్వర్ చేసిన నిందితులు పలు ఖాతాల నుంచి దాదాపు రూ.12.48 కోట్లను పలు ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. హ్యాకింగ్ జరిగి కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని.. మహేశ్ బ్యాంకు అధికారుల హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నగర సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్, నగదు బదిలీ కావడంతో దర్యాప్తు చేపట్టింది. హైదరాబాద్ పోలీసులు దేశవ్యాప్తంగా పలు టీమ్ లతో విచారణ చేపట్టి.. కొందరు నైజీరియన్లు సహా పలువురు నిందితులను అరెస్టు చేశారు.

సైబర్ సెక్యూరిటీ గాలికొదిలేసిన బ్యాంక్!
హైదరాబాద్ సైబర్ పోలీసులు అసలు విషయం తేల్చేశారు. మహేశ్ బ్యాంక్ యాజమాన్యం సైబర్ సెక్యూరిటీపై నిర్లక్ష్యం చేసిందని, అందువల్లే సర్వర్ హ్యాక్ చేసి నగదు పెద్ద ఎత్తున ట్రాన్స్ ఫర్ జరిగిందని దర్యాప్తులో తేలింది. నైజీరియన్ హ్యాకర్లు మొదట బ్యాంకు ఉద్యోగులకు మెయిల్స్, మెస్సేజ్ లు పంపి తరువాత బ్యాంకు సర్వర్ లోకి చొరబడి పలు ఖాతాలకు కొల్లగొట్టిన నగదును ట్రాన్స్ ఫర్ చేశారని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దృష్టికి తీసుకెళ్లారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. 

సైబర్ సెక్యూరిటీని పట్టించుకోని బ్యాంకు లైసెన్సును రద్దు చేయాలని సైతం ఆర్బీఐకి సూచించారు. అయితే చట్టపరంగా ఒక బ్యాంకు లైసెన్స్ రద్దు చేయడం సాధ్యం కాదని.. మహేశ్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా డిపాజిటర్లు, ఖాతాదారుల వివరాలతో పాటు బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉందని.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని గట్టిగా మహేశ్ బ్యాంకు నిర్వాహకులను ఆర్బీఐ మందలించినట్లు తెలుస్తోంది. ప్రజల డబ్బును చెలగాటం ఆడవద్దని సీపీ సీవీ ఆనంద్ బ్యాంకులను కోరారు. 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement