CYGNUS Gastro Hospitals: హైదరాబాద్‌లోని నిజాంపేట ఎక్స్ రోడ్‌లో ఉన్న సిగ్నస్ గ్యాస్ట్రో ఆస్పత్రిలో అరుదైన క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి వైద్య నిపుణులు, యాజమాన్యం ప్రకటించింది. 32 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆహారం, నీరు తీసుకోవడం కష్టం కాగా సిగ్నస్ గ్యాస్ట్రో ఆస్పత్రికి వచ్చారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎగువ అన్నవాహికకు క్యాన్సర్‌గా గుర్తించారు. అనంతరం 3 నెలలపాటు కీమోథెరఫీ, రేడియోథెరఫీ అందించి తిరిగి క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా చేసినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పరీక్షలు నిర్వహించి ఓ క్లిష్టమైన లారింగో ఫారింగో ఈసోఫేజిక్టమితో ఫారింగో గ్యాస్ట్రిక్ అనస్టామోసిస్, పర్మనెంట్ ట్రాకియాసోమి అనే సర్జరీని వైద్య నిపుణులు 10 గంటలు శ్రమించి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.


సర్జరీ తర్వాత 10 రోజుల పాటు ఆస్పత్రిలో నిరంతరంగా చికిత్స అందిస్తూ పూర్తిగా కోలుకున్న అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. 6 నెలలపాటు రెగ్యులర్‌గా వైద్య పర్యవేక్షణలో ఉంచి ప్రస్తుతం సదరు వ్యక్తి క్యాన్సర్ నుంచి సాధారణ స్థితికి చేరుకున్నారని, త్వరలో వాయిస్ బాక్స్ ఇంప్లాంటేషన్ జరపనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సీఈవో & ఎండీ డాక్టర్ వేణు, చీఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, చీఫ్ సర్జన్ డాక్టర్ నవీన్, డాక్టర్ వరుణ్, డాక్టర్ అచ్యుత్, డాక్టర్ ముర్తజా, పేషెంట్, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.