Messi football match in Hyderabad on Saturday:  ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారతదేశంలోని GOAT ఇండియా టూర్ 2025లో భాగంగా  డిసెంబర్ 13  సాయంత్రం 4 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతారు. ఇంటర్ మియామీ స్టార్ మెస్సీకి 'Z+' సెక్యూరిటీ, మొత్తం 3,500 మంది పోలీసులు, SPG టీమ్‌తో భారీ భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్‌కు వెళ్లి విశ్రాంతి తీర్చుకున్న తర్వాత, సాయంత్రం 7 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొంటారు. మ్యాచ్ చివరి 10 నిమిషాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మెస్సితో కలిసి ఆడనున్నారు. ఈ ఈవెంట్‌కు టికెట్లు రూ. 10,000 నుంచి రూ. 5 లక్షల వరకు ధరలు ఉన్నాయి. మెస్సీతో సెల్ఫీ అవకాశం కూడా ఉంది.

Continues below advertisement

GOAT ఇండియా టూర్ 2025 మెస్సీ,  ఇంటర్ మియామీ టీమ్‌తో కలిసి నాలుగు నగరాల్లో జరుగుతుంది. కోల్ కతా నుంచి ప్రారంభమై, హైదరాబాద్‌లో రెండో దశగా జరిగే ఈ టూర్, ముంబై లో డిసెంబర్ 14న, ఢిల్లీలో డిసెంబర్ 15నలో ముగుస్తుంది. 

హైదరాబాద్ షెడ్యూల్ ప్రకారం:

Continues below advertisement

సాయంత్రం 4:00 PM: మెస్సీ  రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్. గ్రీన్ ఛానల్ ద్వారా కస్టమ్స్ క్లియరెన్స్, నేరుగా ఫలక్నుమా ప్యాలెస్‌కు బులెట్-ప్రూఫ్ కాన్వాయ్‌తో ప్రయాణం  సాయంత్రం 5:00 PM - 6:30 PM:  ఫలక్నుమా ప్యాలెస్‌లో విశ్రాంతి  సాయంత్రం 6:30 PM:  ఉప్పల్ స్టేడియంకు పయనం సాయంత్రం 7:00 PM - 8:00 PM: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 'రేవంత్ రెడ్డి 9 vs లియోనెల్ మెస్సీ 10' అనే ఎగ్జిబిషన్ మ్యాచ్. మొత్తం 60 నిమిషాల మ్యాచ్‌లో చివరి 10 నిమిషాలు సీఎం మెస్సితో కలిసి ఆడతారు. మ్యాచ్ తర్వాత మ్యూజికల్ కాన్సర్ట్. 

మెస్సీకి   'Z+' సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో మెస్సీ ఇంటర్ మియామీ టీమ్‌తో కలిసి ఆడతారు. చివరి 10 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో జెర్సీలు మార్చుకుని ఆడతారు – 'రేవంత్ 9 vs మెస్సీ 10' అనే థీమ్‌తో. మ్యాచ్ తర్వాత మ్యూజికల్ కాన్సర్ట్, మెస్సీతో సెల్ఫీ అవకాశం ఉంది.  టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉన్నాయి, మొత్తం 50,000 ఫ్యాన్స్ హాజరు కా అవుతారని అంచనా. 

ఈ మ్యాచ్ కోసం ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు పెడుతోందన్నప్రచారం జరుగుతోంది. కానీ  ఈ ప్రచారాన్ని ఫ్యాక్ట్ చెక్ తోసిపుచ్చింది. తప్పుడు ప్రచారమని స్పష్టం చేసింది.   

 ఈ మ్యాచ్ ను చూసేందకు  ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ వస్తున్నారు.