Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్! నేడు నగరంలో కరెంట్ కట్.. ఈ టైంలోనే మీ ఏరియాలో అంతరాయం..

హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఉండనున్నాయి. ఈ మేరకు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత సేపు కరెంటు కట్ ఉంటుందనే విషయాలను విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

Continues below advertisement

విద్యుత్ సరఫరా లైన్లకు మరమ్మతుల కారణంగా గురువారం (జనవరి 27) హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఉండనున్నాయి. ఈ మేరకు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత సేపు కరెంటు కట్ ఉంటుందనే విషయాలను విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాలు ఇవీ.. 

Continues below advertisement

* పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు: ఆదర్శనగర్‌ ఫీడర్‌లో.. ఆదర్శనగర్, ఎస్‌బీఐ, బిర్లా మందిర్, పవర్‌ డిప్లొమా ఇంజినీర్ల అసోసియేషన్ కార్యాలయం, ఈఎస్‌ఐ, ఆదర్శ్‌ కేఫ్‌ అండ్‌ బేకరీ, మ్యాక్స్‌ క్యూర్‌ హాస్పిటల్, బాగారెడ్డి డీటీఆర్, జలమండలి, షాపూర్‌జీ టవర్స్, సంజయ్‌గాంధీనగర్, బిర్లా ప్లానిటోరియం ప్రాంతాల్లో కరెంటు కట్ అవ్వనుంది.

నిజామ్‌ కాలేజీ ఫీడర్‌లో పరిధిలో నిజామ్‌ కాలేజీ, లా కాలేజీ, బాహర్‌ కేఫ్, కింగ్‌ కోఠి షేర్‌ గేట్, యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ బిల్డింగ్, దోషి చాంబర్స్, హైలైన్‌ చౌరస్తా, భారతీయ విద్యా భవన్, బికనీర్‌ వాలా స్వీట్‌ షాప్‌ (హైదర్‌గూడ) ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనుంది.

* ఉదయం 10 నుంచి 2 గంటల వరకు: ప్రకాష్‌నగర్, సంజీవయ్యపార్క్‌ సబ్‌స్టేషన్ల పరిధిలోని ప్రకాష్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఏరియా, ఆర్కా మసీద్, కామత్‌లింగాపూర్, ప్రకాష్‌నగర్‌ వాటర్‌ ట్యాంక్‌ పరిసర ప్రాంతాల్లో అంతరాయం ఉండనుంది.

* ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు: జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.78, పద్మాలయా స్లమ్‌ ప్రాంతం, మహేష్‌ బాబు నివాస ప్రాంతం, ఈశ్వరవల్లి, పద్మాలయా స్టుడియో, బాబూ జగ్జీవన్‌రామ్‌ కాలనీ, సెంటర్‌ ప్రాంతం, పరుచూరి గోపాలకృష్ణ ఇల్లు, మధురానగర్, యూసుఫ్‌ గూడ మెయిన్ రోడ్డు, మధురానగర్‌ జీ-బ్లాక్, దేవరాయనగర్, సారా డిపో ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు ఉండనుంది.

* మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు: ఎన్టీఆర్‌ మార్గ్‌, లుంబినీ పార్కు, అమోఘం హోటల్, హనుమాన్‌ టెంపుల్, బాబూఖాన్‌ ఎస్టేట్, ఎల్‌బీ స్టేడియం మెయిన్‌ రోడ్డు, పెట్రోల్‌ బంక్, పోలీసు కమిషనర్‌ ఆఫీస్, నిజామ్‌ హాస్టల్, ఎల్‌బీ స్టేడియం, జగదాంబ జువెలర్స్‌ బిల్డింగ్‌ తదితర ప్రాంతాల్లో కరెంటు అంతరాయం కలగనుంది.

* మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు: బీజేఆర్‌ కాలనీ, రామానాయుడు స్టూడియోస్, మధురా నగర్, యూసుఫ్‌ గూడ మెయిన్ రోడ్డు, మధురానగర్‌ జీ-బ్లాక్, దేవరాయ నగర్, వెల్లంకి ఫుడ్స్‌ ఎదురు ప్రాంతం, సారా డిపో ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనుంది.

* మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు: సంజీవయ్యపార్క్, గ్రీన్‌ల్యాండ్స్, ప్రకాష్‌ నగర్, శ్రీనివాస టవర్స్, ఆల్విన్‌ సబ్‌స్టేషన్ల పరిధిలోని ఎన్‌బీటీ నగర్, వికార్‌ నగర్, అమోఘ్‌ ప్లాజా, బ్లూమూన్‌ హోటల్, మెయిన్ ల్యాండ్‌ చైనా, ఎఫ్‌సీఐ గోడౌన్స్‌, ఎర్రగడ్డ మెయిన్‌ రోడ్ పరిసరాల్లో అంతరాయం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఉండనుంది.

Continues below advertisement