Modi Hyderabad Visit Live:రామానుజాచార్యుల విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ  

ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన వివరాలకు సంబంధించి లైవ్ అప్ డైట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 05 Feb 2022 06:45 PM

Background

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. నగరంలో ఇక్రిశాట్‌ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాల్లో ఆ తర్వాత ముచ్చింతల్‌లో రామానుజాచార్య విగ్రహావిష్కరణలో ప్రధాని పాల్గొంటారు. అయితే, ప్రధాని హైదరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన వెంటనే ఉండనున్నారు. తొలుత శంషాబాద్‌...More

రామానుజాచార్యుల విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ  

హైదరాబాద్ ముచ్చింతల్‌ సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి రోజున జాతికి అంకితం ఇచ్చారు. పంచలోహాలతో రూపొందించిన ఈ విగ్రహం కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహం. సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాలు నిర్మించారు. సమతామూర్తి కేంద్రాన్ని ఎల్ఈడీ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్వహించిన యాగంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యాగశాలలో ప్రధానికి చినజీయర్‌ స్వామి స్వర్ణకంకణం అలంకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పాల్గొన్నారు.