వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో తొలిసారి జరిగిన గ్యామ్ మీట్ అపూర్వ స్పందన వచ్చింది. నాలుగు దశాబ్దాల క్రితం ఓయూలో చదువుకుని ,వివిధ శాఖల్లో ఉన్నత స్థానంలో కొలువుదీరిన పూర్వ విద్యార్దులతంతా ఈ గ్లోబల్ అల్యూమ్నీ మీట్ (GAM)లో ఒక్కటైయ్యారు.
రెండు రోజులపాటు జరిగిన మీట్ లో ఓయూకు వెన్నుదన్నుగా నిలబడేందుకు పూర్వ విద్యార్దులు తీసుకున్న పలు కీలక ఒప్పందాలు, ఇచ్చిన విరాళాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఓయూలో పూర్వ విద్యార్దులు అరకొరగా కలిసినప్పటికీ ఈ స్దాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్దులంతా ఒక్కటవ్వడం ఇదే తొలిసారి కావడం ప్రత్యేకత సంతరించుకుంది.
ఉస్మానియా యూనివర్సిటీలో రెండు రోజులపాటు జరిగిన గ్యామ్ మీట్ ఓయూ విద్యార్దుల్లో కొత్త జోష్ నింపింది. మీట్ లో భాగంగా మొదటి రోజు ఓయూలో చదువున్న పూర్వ విద్యార్దులైన సినీ ,రాజకీయ ప్రముఖులతోపాటు పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హజరయ్యారు. తాము చదువుకున్న రోజుల్లో ఓయూలో పరిస్థితులు, అప్పట్లో చేసిన చిలిపి అలర్లు ఇలా పాత రోజులను గుర్తు చేసుకోవడమేకాదు, క్లాస్ రూమ్ లో పాఠాలు సైతం చెప్పి విద్యార్దుల్లో ఉత్సహాం నింపారు.
ఓయూలో చదువుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా, బిల్డర్ లుగా,రాజకీయ నాయకులుగా ఎదిగివారు సైతం తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి పాత మిత్రులను కలుస్తున్నామనే ఉత్సాహంతో గ్యామ్ మీట్ కు హజరైయ్యారు. సరదా క్రీడలు నిర్వహించడంతోపాటు పలు సామాజిక అంశాలపై చిట్ చాట్ లో పూర్వ విద్యార్దులు పాల్గొన్నారు. చివరి రోజు నిర్వహించిన వీసి ఆవార్డ్స్ కార్యక్రమంలో ఓయూలో ఉన్నత చదువులు పూర్తి చేసి ప్రస్తుతం వివిధి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వీసిలుగా పని చేస్తున్న పూర్వ విద్యార్దులు ఇష్టాగోస్టిలో పాల్గొన్నారు. ప్రస్తుతం విద్యావిధానం, లోపాలతోపాటు పరిష్కార మార్గాలపై సుదీర్గంగా ఈ గ్యామ్ వేదికపై చర్చించారు. యూనిర్సిటీలలో నియామకాల విషయంలో జరుగుతున్న జాప్యం, సమస్య పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు.
ఓయూ గ్యామ్ మీట్ లో ప్రస్తుతం క్యాంపస్ లో ఉన్న సమస్యలపై పూర్వవిద్యార్దులు ప్రత్యేక దృష్టి సారించారు. తమ సొంత డబ్బుతో స్కాలర్ షిప్స్ ఇవ్వడంతోపాటు ఓయూలో విద్యార్దులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమై ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కొందరు తమ వంతు సహాయంగా విళాలు చెక్ ల రూపంలో అందజేశారు. ఓయూ ఉన్నతికి అవసరమైన అంశాలపై చర్చించి 8 ఎంఓయూలపై సంకతాలు చేసారు. ఇలా ఒకటేమిటి నలభై ఏళ్ల తరువాత ఒక్కటైన ఓయూ విద్యార్దులు ఇప్పటి వరకూ చూడని తమ పాత మిత్రులను కలవడంతోపాటు క్యాంపస్ లో తీపి గుర్తులను మరోసారి కళ్లముందు కదిలేలా క్లాస్ రూమ్ లలో సందడి చేసారు.
మొదటి రోజు ఉత్సాహంగా సాగిన సమావేశం... చివరి రోజు కాస్త ఎమోషన్‌గా నడిచింది. విడిపోతున్నామన్న బాధ అందరిలో కనిపించింది. ఇందులో చాలా మంది అరవై ఏళ్లకు పైబడిన వాళ్లే ఉన్నందున భవిష్యత్‌లో జరిగే మీటింగ్‌లకు వచ్చి స్నేహితులను కలుస్తామో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అందరిలో కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ప్రతి మజిలీ ఎప్పుడో ఒకప్పుడు విడిపోయేదే అనుకొని మళ్లీ అంతా హ్యాపీగా వీడ్కోలు చెప్పుకున్నారు.