Hyderabad Metro Employees: హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమించారు. గత కొంత కాలంగా సిబ్బంది చేస్తున్న నిరసనపై సానుకూలంగా స్పందించడంతో మెట్రో టికెటింగ్ ఉద్యోగులు సమ్మె విరమించారు. కానీ వేతనం పెంచమని చెప్పారు. మెట్రో యాజమాన్యం జీతం పెంచమని చెప్పినా సిబ్బంది ఎందుకు సమ్మె విరమించారనే అనే అనుమానం వస్తోందా.. వేతనాల అంశంలో మెట్రో టికెటింగ్ ఉద్యోగులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కాగా వీరి సమ్మెపై కియోలిన్ అధికారులు స్పందించారు. వేతనం  వేల రూపాయలు పెంచేదిలేదని స్పష్టం చేశారు. కాకపోతే ఇతర డిమాండ్లపై మాత్రం సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు సమ్మెను విరమించుకున్నారు. తిరిగి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. 


అసలేం జరిగిందంటే..?


హైదరాబాద్‌ మెట్రో సంస్థలో పని చేసే ఉద్యోగులు చేస్తున్న జనవరి మూడో తేదీ నుంచి ధర్నా చేయడం ప్రారంభించారు. తమకు జీతాలు పెంచాలని సమ్మె చేస్తూ మెట్రో టికెటింగ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో సంస్థ ఆఫీస్ వద్ద టికెటింగ్ సిబ్బంది ఆందోళన నిర్వహించారు. మెట్రోలో తమకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడం సహా, తమ జీతం ప్రస్తుతం ఉన్న రూ.11 వేల నుంచి రూ.20 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. గత ఐదేళ్ల నుంచి జీతాలు పెంచలేదని వాపోయారు. 






మంగళవారం కూడా మెట్రో రైల్‌ టికెటింగ్ సిబ్బంది అమీర్ పేట్ మెట్రోస్టేషన్ లో నిరసన చేశారు. తమకు జీతాలు పెంచాలని దాదాపు 300 మంది ఉద్యోగులు డిమాండ్ చేశారు. స్టేషన్స్ లో టికెట్ కౌంటర్, మెయింటెనెన్స్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు దాదాపు 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని వాపోయారు. చాలీచాలని జీతాలు ఇవ్వడమే కాకుండా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఉద్యోగం విషయంలోనూ చాలా సమస్యలు ఎదురవుతున్నాయని, ఒకరు ఉద్యోగం చేస్తుంటే సమయానికి రావాల్సిన రిలీవర్ రాకపోయినా పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఒక్కోసారి భోజనం చేయడానికి కూడా సమయం ఉండని పరిస్థితి ఎదురవుతోందని అన్నారు. మెట్రో సిబ్బంది ధర్నా చేయడంతో సిబ్బంది కాంట్రాక్ట్ ఏజెన్సీ అయిన కియోలిస్ సంస్థ వారితో చర్చలు జరిపింది. దాంతో ధర్నా తాత్కాలికంగా విరమిస్తున్నట్లుగా వారు తెలిపారు. వేతనాల పెంపు విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి చెప్తామని హామీ ఇచ్చారు. అయితే, స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ విధులకు హాజరుకాబోమని సిబ్బంది తేల్చి చెప్పారు.