NICE Hospital Hyderabad: పురిట్లో ప్రాణాలు పోతున్న పసివారి గురించి రోజూ చాలా మనం చూస్తున్నాం, వింటూనే ఉన్నాం. ఇకపై అలాంటివి జరగకుండా ఉండేందుకు నైస్‌ హాస్పిటల్‌ సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు, అత్యవసర చికిత్స అవసరమైన పసిపాలకు హైదరాబాద్‌లోని నైస్ హాస్పిల్‌ ఇప్పుడు గట్టి భరోసా ఇవ్వబోతోంది. నైస్‌ నియోటెక్‌ మెడిక్ సిస్టమ్స్‌, రెయిన్ డ్రాప్స్‌ ఛారిటీ ఫౌండేషన్ కలిసి చేపట్టిన ప్రాజెక్టు ఇప్పుడు సరికొత్త హైదరాబాద్‌ వైద్యరంగంలోనే మైలురాయిగా నిలవబోతోంది. 

Continues below advertisement

కార్పొరేట్ సొషల్‌ రెస్పాన్సిబిలిటీ అంటే కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాదు. అది ఒక జీవితాన్ని నిలబెట్ట సంకల్పం అని ఈ సంస్థలు నిరూపించాయి. 14 లక్షల విలువైన అత్యాధునిక నియోనాటల్‌ ఎక్యూప్‌మెంట్ను విరాంగా అందజేయడం ద్వారా హైదరాబాద్‌లోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు చెందిన చిన్నారులకు వరల్డ్‌ క్లాస్‌ చికిత్స అందుబాటులోకి రానుంది. ఈ సాయం కేవలం పరికరాల రూపంలోనే కాదు, వందల మంది కుటుంబాల్లో వెలుగులు నింపే ఆశాదీపంగా మారబోతోంది. 

రెయిన్‌డ్రాప్స్‌, నైస్‌ నియోటెక్ చొరవతో... 

సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల లేదా పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మాత్రమే ఉండే అత్యాధునిక వైద్య సదుపాయాలను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించారు. నైస్ నియోటెక్‌ మెడికల్ సిస్టమ్‌ తమ సామాజిక బాధ్యతను గురించి, ఈ భారీ విరాళానికి ముందుకు రాగా, దీనిని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసిన ఘనత రెయిన్ డ్రాప్స్‌ ఛారిటీ ఫౌండషన్‌కు దక్కుతుంది చెన్నైకి చెందిన ఈ స్వచ్ఛంద సంస్థ, సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తూ, ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేసింది. 

Continues below advertisement

ఈ పరికరాల ప్రత్యేకత ఏంటీ?

నైస్ హాస్పిటల్‌కు అందించిన ఈ అడ్వాన్డ్‌ నియోనాటల్‌ ఎక్యూప్‌మెంట్ వల్ల నైసు సేవలు మెరుగుపడతాయి. నెలలు నిండక ముందే పుట్టిన శిశువుల శ్వాసక్రియ, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే అధునాతన వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శిశువులకు తక్షణమే అందించాల్సిన అత్యవసర వైద్యసేవలకు ఈ పరికరాలు వెన్నెముకగా నిలుస్తాయి. ప్రతి చిన్నారికి అవసరమైన కచ్చితమైన చికిత్సను అందించడంలో వైద్యులకు ఈ టెక్నాలజీ సహకరిస్తుంది. 

అట్టహాసంగా హ్యాండోవర్ వేడుక 

హైదరాబాద్‌లో నైస్‌ హాస్పిటల్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ పరికరాలను అధికారికంగా అందజేశారు. నైస్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్ పద్మనాభ రెడ్డికి, నైస్‌ నియోటెక్ మెడికల్‌ సిస్టమ్స్‌ హెడ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ కెర్లిన్‌ విల్స్, రెయిన్ డ్రాప్స్‌ ఛారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అరవింద్‌ జయబాల్‌ ఈ పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ టీం సభ్యులు డాక్టర్ వినయ్‌ కుల్‌కర్ణి, డాక్టర్ అక్షయ్‌ రెడ్డి డాక్ట్‌ ఐశ్వర్య రెడ్డి, పాల్గొన్నారు.