Mystery Virus: దేశంలో మరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలకు పొరుగున ఉన్న హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసుల చాలా తక్కువ సంఖ్యకే పరిమితమైందని వైద్యులు చెబుతున్నారు. అయితే చాలా మంది స్వైన్ ఫ్లూ సాధారణ లక్షణాలను కలిగి ఉన్నా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి వైరస్ నిర్ధారణ కోసం పరీక్షలు చేస్తున్నారు. అవసరం అయిన వారికి కోవిడ్ -19కి పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ ఏంటో గుర్తించలేదని, కానీ ఈ వైరస్ సోకిన శ్వాసకోస ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. వైరస్ సోకిన వారికి గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM)లో స్వైన్ ఫ్లూ, కోవిడ్-19, ఇన్‌ఫ్లుఎంజా A, ఇన్‌ఫ్లుఎంజా B పరీక్షలు చేస్తున్నారు. 


గత రెండు మూడు నెలలుగా కొంత మందిలో వైరస్ గుర్తించామని, అనేక మంది తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలిందని వైద్యులు చెబుతున్నారు. వారికి కరోనా వైరస్, స్వైన్ ఫ్లూ, ఇన్‌ఫ్లుఎంజా  పరీక్షలు తెలిపారు. సాధారణంగా, ఇన్‌ఫ్లుఎంజా ఉన్నవారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. మామూలుగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు స్వైన్ ఫ్లూ, కోవిడ్ -19 కోసం పాజిటివ్ చేస్తారని, కానీ ఇప్పుడున్న పరిస్థితి అలా కాదని గాంధీ హాస్పిటల్ వైద్యులు చెబుతున్నారు. ఇది కొత్త తరహా శ్వాసకోశ వైరస్ కావచ్చని అభిప్రాయపడ్డారు. దీనిపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్యం చేస్తున్నారు. వైరస్ ప్రమాదకర స్థాయిలో లేదన్నారు. ఈ కేసులన్నింటిలో రికవరీ రేటు ఇప్పటి వరకు 100% ఉందని, రోగ లక్షణాలు ఉన్న వ్యక్తి చికిత్స ద్వారా ఐదు రోజులలోపు కోలుకుంటున్నారని చెప్పారు. 


అంతేకాకుండా, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు వైరస్‌ల మనుగడకు ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తాయన్నారు. ఈ కేసుల్లో కొన్ని స్వైన్ ఫ్లూ, కోవిడ్ -19 లక్షణాలను పోలి ఉన్నాయని, పరిస్థితి ఆందోళనకరంగా లేదన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మానవులను ప్రభావితం చేసే 200 కి పైగా శ్వాసకోశ వైరస్లు ఉన్నాయి. వాటిలో ఇన్‌ఫ్లుఎంజా వైరస్లు, రైనోవైరస్, ఎంట్రోవైరస్, SARS, MERS, కరోనా వైరస్లు, శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్, పారా ఇన్‌ఫ్లుఎంజా వైరస్ సర్వసాధారమైనవి. ఇవి తేలికపాటి రూపంలో ఉంటాయి. వీటికి ఎలాంటి పరీక్షలు అవసరం లేదు. ఐదు నుంచి ఏడు రోజులలోపు తగ్గిపోతాయి. 


పరీక్షలు చేయట్లేదా?
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికీ కొన్ని స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని తెలుస్తున్నా, రాష్ట్ర ఆరోగ్య అధికారులు వీటిపై భిన్నంగా స్పందిస్తున్నారు.  అధికారుల లెక్కల ప్రకారం ఈ సంవత్సరం ఇప్ప టివరకు స్వైన్ కేసులు 50 కంటే తక్కువగా ఉన్నాయి. గత సంవత్సరం 256 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. మనం ఎప్పటికప్పుడు స్వైన్ ఫ్లూ కేసులను చూస్తామని, కానీ అందరికీ పరీక్షలు చేయడం లేదని ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. లక్షణాలు ఉన్న చాలా మంది పారాసెటమాల్ మాత్రలు వేసుకుని మూడు రోజుల్లో కోలుకుంటున్నారని, అందుకే వారు పరీక్షలకు కూడా రారని అన్నారు. మొత్తంగా ధృవీకరించబడిన కేసులు చాలా తక్కువ అని ఆయన తెలిపారు.