MMTS Trains Cancelled: హైదరాబాద్ సికింద్రాబాద్​ జంట నగరాల్లో తిరిగే పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రేపు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్ వాసులకు ఎంఎంటీఎస్ సర్వీసులపై కీలక అప్‌డేట్ వచ్చింది. జంట నగరాలలో పలు ఎంఎంటీఎస్ సర్వీసులను ఒకరోజు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నిర్వహణ సమస్యల కారణంగా జూన్ 3న పలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేశారు.


నగరంలో ముఖ్యంగా హైదరాబాద్‌ - లింగంపల్లి మధ్య నడిచే సర్వీసులు 9, ఫలక్‌నుమా - లింగంపల్లి మధ్య నడిచే 7 సర్వీసులు, సికింద్రాబాద్‌ - లింగంపల్లి మధ్య నడిచే ఒక్క ఎంఎంటీఎస్‌, లింగంపల్లి -హైదరాబాద్‌ మార్గంలో 9 సర్వీసులు, లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో నడిచే 7 సర్వీసులను, లింగంపల్లి - సికింద్రాబాద్ మధ్య నడిచే మరో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 






రద్దయిన సర్వీసుల వివరాలు..
హైదరాబాద్‌ - లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు - 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
లింగంపల్లి - హైదరాబాద్ మార్గంలో 9 సర్వీసులు - 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140
ఫలక్‌నుమా - లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు - 47153, 47164, 47165, 47216, 47166, 47203, 47220, 47170
లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసులు - 47176, 47189, 47186, 47210, 47187, 47190, 47191, 47192 
లింగంపల్లి - సికింద్రాబాద్ మార్గంలో 1 సర్వీసు - 47195 
సికింద్రాబాద్ - లింగంపల్లి మార్గంలో 1 సర్వీసు - 47150 సర్వీసు రద్దు 






Also Read: TRS Questions PM Modi: తెలంగాణలో కాలుపెట్టక ముందే ప్రధాని మోదీకి అధికార టీఆర్ఎస్ బిగ్ షాక్ 


Also Read: High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్‌