హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొదటిసారి శాసనమండలిలో బోరున ఏడుస్తూ ప్రసంగం కొనసాగించారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే మండలిలో ప్రసంగం కొనసాగించారు. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తరువాత, పార్టీతో విభేదించిన తరువాత, సొంత కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన సందర్భంలో కూడా ఈ విధంగా కవిత కన్నీళ్లు పెట్టుకున్న సంధర్బాలు లేవనే చెప్పాలి. మండలిలో చివరి ప్రసంగం అనుకున్నారో లేక, ఇదే తనకు మాట్లేందుకు మండలిలో సరైన అవకాశం అనుకున్నారో మొత్తనానికి తన మనసులోని బాధను, అవమానాలను ,ఆవేదనను మండలి సాక్షిగా బయపెట్టేశారు. శానసనమండలిలో ఏడుస్తూ ప్రసంగం కొనసాగించిన కవిత ఏం మాట్లడారంటే..
4 నెలలైనా రాజీనామాపై నిర్ణయం తీసుకోలేదు..
నేను గత ఏడాది సెప్టెంబర్ 3వ తేది నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. ఆరోజు మీరు ఆవేశపడకండి, ఆలోచించుకోండి సమయం ఇస్తున్నానని చెప్పారు. నాలుగు నెలల సమయంలో కూడా మీరు నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు సభకు చెప్పాలని భావించాను. నాకు ఈ గౌరవాన్ని ఇచ్చిన బీఆర్ ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా భాద్యతలను నిర్వర్తించడానికి ఇప్పుడు అదే పార్టీ నుండి నాకు అనేక కట్టుబాట్లు ఎదురవుతున్నాయి.అందుకే ఆపార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నాను. పార్టీ ఇచ్చిన పదవిలో కొనసాగడం నైతికత కాదు కాబట్టి , పార్టీ ఇచ్చిన పదవకిి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. మీరు నా రాజీనామా ఆమోదించాలని సభాముఖంగా కోరుతున్నాను.
ఊరూరా తిరిగి ప్రచారం చేశా..
తెలంగాణ ఉద్యమంలో మహిళాలోకాన్ని తీసుకురావడానికి జాగృతిని స్దాపించాను. బతుకమ్మ పండుగను ఊరూర తిరుగుతూ విపరీతంగా ప్రచారం చేశాను. మన బాషను, యాసను కాపాడుకోవడానికి నా వంతు ప్రయత్నం చేశాను. గత ఎనిమిది సంవత్సరాలుగా ఓ ఇండిపెండెంట్ సంస్దగా మేమున్నాము. 2004లో నా వ్యక్తిగత కారణాలతో అమెరికా నుండి భారత్ కు వచ్చాను. 2013 జూలై, ఆగస్టు సమయం నుండి 2014 తెలంగాణ ఏర్పాటైయ్యేవరకూ నిర్విరామంగా ప్రయత్నం చేయడంలో నా పాత్ర కూడా ఉంది.
2014లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ నన్ను పిలిచి నిజామాబాద్ నుండి ఎంపీ టిక్కెట్ ఇచ్చాను.అప్పట్లో పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. నేను ఎప్పుడూ పార్టీని అడుక్కొని టిక్కెట్ దక్కుంచుకోలేదు. టీఆర్ ఎస్ పాార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని అందరం కలసి పనిచేశాము. నిజామాబాద్ రైల్వే లైన్ నుండి అనేక అభవృద్ది కార్యక్రమాలు చేశాను. 2014లో మొదటి బతుకమ్మ వేడుకల నుండే నన్ను పార్టీలో కట్టడి చేయడం మొదలు పెట్టారు.
బోెరుమని ఏడ్చేసిన కవిత..
బతుకమ్మ వేడుకలను అడ్డుకునే ప్రయత్నంతో నన్ను కట్టడి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఒక్కసారిగా బోరున ఏడ్చేశారు కవిత. ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకోలేక ప్రసంగం కొనసాగించారు. నేను ఎక్కడా తెలంగాణ బిడ్డలను, ప్రజలను బాధపెట్టకుండా నవ్వుతూ పనిశాను. నా వద్దకు కాంట్రాక్టర్లు , పెట్టుబడిదారులు లేదు. నిరుపేదలు,ఆశావర్కర్లు, బీడీ కార్మికులు ఇలా అనేక మంది నిరుపేదలు వారి సమస్యల పరిష్కారం కోొసం మాత్రమే నా వద్దకు వచ్చారు. జీహెచ్ ఎంసీ కార్మికుల, సింగరేణి ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు ఇలా ఎవరు వచ్చినా పనిచేసిపెట్టాను. పార్టీ ఛానెన్లు , పేపర్లు ఎవరూ నాకు ఎటువంటి మద్దతు ఇవ్వలేదు.
తెలంగాణ వచ్చిన 10ఏళ్లలో కాంట్రాక్టు వ్యవస్దను రద్దు చేసుకోలేకపోయాము. నేను పార్టీని ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే తట్టుకోలేకపోయారు. కొందరు నన్ను టార్గెట్ చేశారు. పార్టీలోని కొందరు కక్షగట్టి బయటకు పంపారు.రాష్ట్ర స్దాయి నిర్ణయాల్లో మొదటి నుండి ఎక్కడా నా పాత్ర లేకుండా చేశారు. ధర్నా చౌక్ ను రద్దు చేయడం కూడా దారుణం. రైతులను కూడా అప్పట్లో అక్రమ అరెస్ట్ లు చేశారు. ప్రభుత్వంలో అవినీతిని ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదు. అమరజ్యోతి నుండి మొదలు సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం..అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం. కలెక్టరేేట్లు సైతం అవినీతితో మునిగిపోయాయి.
ఉద్యమకారులను సైతం నిర్లక్ష్యం చేసారు. మనిషికి 10లక్షలు ఇద్దామని చెప్పినా పట్టించుకోలేదు. పెన్షన్ ఇద్దామని చెప్పినా వినలేదు. నీళ్లు,నిధులు,నియామకాలు .. ఇలా అన్ని విషయాల్లోనూ గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. ఇసుక దందాలు జరిగాయి. దళిత బిడ్డలు బలైపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోకపోవడం దారుణం. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడం దారుణం.కేసీఆర్ దగ్గర మాట్లడే దైర్యం నాకు మాత్రమే ఉంది. ఆయన క్రింద ఉన్న అనేక మంది వ్యక్తులు తప్పుదోవపట్టిస్తున్నారు.
టీఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ గా మార్చే నిర్ణయాన్ని సైతం నేను తీవ్రంగా వ్యతిరేకించాను. ఆరోజు జరిగిన మీటింగ్ కు సైతం నేను వెళ్లలేదు. పేరు మార్పుకు ఒప్పుకోలేదు. తెలంగాణలో ఏం పీకామని ,జాతీయ స్దాయిలోకి వెళతాము. అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి. లక్షా 89 కోట్లు ఖర్చెపెట్టినా సాగునీటి ప్రాజక్టులు సరిగా పూర్తి చేయలేకపోాయాము. ఈ నిర్ణయాల వల్ల కాంట్రాక్టర్లు బాగుపడ్డారు. ఒకే కంపెనీకి లక్షల కోట్ల ప్రాజెక్టు అప్పగించడం దారుణం.
బీజేపి సైతం తెలంగాణను పదేపదే మోసం చేస్తూ వస్తోంది. ఐఐటీ వంటి సంస్దలు తెలంగాణకు ఇవ్వలేదు. ఇక్కడి యువకులకు తీవ్ర అన్యాయం చేశాను. నేను బీజేపీపై పోరాటం చేస్తూనే ఉన్నాను. కేసీఆర్ పై కోపంతో నన్ను జైల్లో పెట్టారు. నన్ను జైల్లో పెట్టినప్పుడు పార్టీ ఎక్కడా అండగా నిలబడలేదు. నేను వారి భావజాలంతో లేనప్పుడు నన్ను తీసేయాలి.కానీ పార్టీలో ఉంచుతూ నన్ను ఒంటరిని చేశారు. కేసీఆర్ ను ఎవరు విమర్మించినా పట్టిచుకోరు, అదే హరీష్ రావు అంటే నిరసనలు చేస్తారు. ఇదే విషయాలు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. హరీష్ రావు అవినీతిపై బయటపెట్టానని నాపై పార్టీలో చర్యలు తీసుకున్నాను. బీఆర్ ఎస్ పార్టీ నిబంధనులు పెద్ద జోక్. షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే సస్పెండ్ చేయడం దారుణం. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. ఒక పార్టీ నడిపే పద్దతి ఇది కాదు.
బీఆర్ ఎస్ పార్టీ నుండి దూరమవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబం, నా రక్తం,నా శ్రమ.. నేను 20 ఏళ్లు పార్టీ గుంచి పడ్డ శ్రమ గుర్తించకుండా, కనీసం ఉరితీసేవాడ్నైనా అడుగుతారు. నన్నుమాత్రం అడగలేదు. కాంగ్రెస్ నా సస్పెన్షన్ వాడుకోవాలని చూస్తున్నారు. నాది ఆస్తి పంచాయితీ కాదు, ఆత్మగౌరవ పంచాయితీ.
నా ఇద్దరు బిడ్డలమీద ప్రమాణం..
నాది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మగౌరవ పంచాయితీ, నా ఇద్దరు బిడ్డలమీద ప్రమాణం చేసి చెబుతున్నాను. రాజకీయ నాయకులకు,పార్టీలకు మహిళనేతలపై కనీస గౌరవం లేదు. ఆడవాళ్ల కష్టాలు ఎవరికి చెప్పాలి. మహిళల కొోసం పార్టీలు రాజ్యాంగాలు మార్చాలి. పార్టీలు అవకాశం ఇవ్వకపోతే ఎవరు మహిళలను పట్టించుకుంటారు. కేసీఆర్ గారంటే మాకు అపార గౌరవం ఉంది. ఉద్యమకారులకు , కష్టకాలంలో అండగా ఉన్నవారిని అందరినీ ఇలా ఆగం చేస్తారని అనుకోొలేదు. ఉద్యమ ద్రోహులకు , రాజకీయ పునరావాస కేంద్రంగా బీఆర్ ఎస్ పార్టీ మారింది. నైతికత లేని పార్టీలో నేను ఉండలేను. ఆ పార్టీ పదవిలో కూడా ఉండలేను. నా రాజీనామా ఆమోదించాలని కోరుతున్నాను.
మరోసారి ఆలోచించండి .. మండలి చైర్మెన్
కవిత భావోద్యేగ ప్రసంగం ఆద్యాంతం విన్న మండలి చైర్మెన్ మాట్లడుతూ .. మరోసారి ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై ఆలోచన చేయాలని కోరారు. మీ ఆవేదన అర్దం చేసుకున్నాం. భావొద్వేగంతో నిర్ణయాలు సరికాదు. మరోసారి రాజీనామాపై ఆలోచన చేయాలని కోరుతున్నానని అన్నారు. వెంటనే స్పందించిన కవిత ఇప్పటికే నాలుగు నెలలు అయ్యింది. ఇప్పటికే సుధీర్గంగా ఆలోచన చేశాను. దయచేసి నా ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదించాలని కోరుతున్నట్లు కవిత అన్నారు.