KTR Meets Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను మంత్రి కేటీఆర్ కలిశారు. ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇద్దరు హైదరాబాదీలు కలిస్తే.. రోజు చాలా ప్రత్యేకంగా ప్రారంభం అవుతుందని మంత్రి కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. సత్య నాదెళ్లతో బిజినెస్, బిర్యానీ గురించి చర్చించినట్లు వివరించారు. ప్రస్తుతం మైస్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భారతదేశ పర్యటనలో ఉన్నారు. రెండ్రోజుల క్రితమే ఆయన ప్రధాని మోదీని కలిశారు. ఆ తర్వాత బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.






బెంగళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్ లో చాట్ జీపీటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ రోబోను నాదెళ్ల పరియచం చేశారు. ఆ రోబోతో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో పాపులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏముంటాయని ఆయన చాట్ రోబోను ప్రశ్నించగా.. ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ అధి సమాధానం ఇచ్చింది. వెంటనే స్పందించిన సత్య నాదెళ్ల.. బిర్యానీని సౌత్ ఇండియా టిఫిన్ అంటూ తన నాలెడ్జ్‌ను అవమానించవద్దని చెప్పారు. దీంతో వెంటనే చాట్ రోబో క్షమాపణ చెప్పింది.