తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నుంచే కాకుండా సినీ పరిశ్రమ నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రామ్ చరణ్, రామ్ గోపాల్ వర్మ, హరీశ్ శంకర్, బండ్ల గణేశ్, అనసూయ వంటి సినీ తారలు మంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు ట్విటర్‌ లో తెలిపారు. ఇందుకు మంత్రి కేటీఆందరికీ రిప్లై ఇచ్చారు.


చిరంజీవి ట్వీట్ చేస్తూ హ్యాపీ బర్త్ డే డియర్ రామ్, పుట్టిన రోజు శుభాకాంక్షలు అని శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే టూ మై డియరెస్ట్ బ్రదర్, హార్డ్ వర్కింగ్ లీడర్ కేటీఆర్ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. అందుకు కేటీఆర్ కూడా థ్యాంక్యూ బ్రదర్ అంటూ బదులిచ్చారు.










ఇంకా దర్శకులు రామ్ గోపాల్ వర్మ, హరీశ్ శంకర్, బాబీ కూడా మంత్రి కేటీఆర్ ను కీర్తిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బండ్ల గణేశ్, అనసూయ ట్విటర్ లో కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పారు.






ఏపీకి చెందిన రాజకీయ నాయకులు ప్రస్తుత ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, విజయసాయి రెడ్డి, గంటా శ్రీనివాసరావు కూడా శుభాకాంక్షలు చెప్పారు.


అంతేకాక, యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లేమింగ్ కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపగా, కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నీకు ఇంతకన్నా వేరే ఫోటో దొరకలేదా అంటూ సరదాగా కామెంట్ చేశారు. భారత్ లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బార్రీ ఓ,ఫెర్రెల్ కూడా ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.










పార్టీ ఎక్కడ భాయ్.. - సోనూసూద్


నటుడు సోనూసూద్ కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన పార్టీ ఎక్కడ భాయ్ అంటూ అడిగారు. అందుకు కేటీఆర్ థ్యాంక్స్ భాయ్ అంటూ రిప్లై ఇచ్చారు.