హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ లో ప్రియురాలు తన ప్రియుడిని కిడ్నాప్ చేయించిన వ్యవహారంలో కీలక ట్విస్ట్ చేసుకుంది. ఆమె ఏకంగా తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడు అవినాష్ రెడ్డిపై, అరోషిక రెడ్డి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అవినాష్ రెడ్డి, అరోషిక రెడ్డి కలిసి గతంలో తీసుకున్న సెల్ఫీలను అవినాష్ తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.


ఈ కిడ్నాప్ వ్యవహారం సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంలోకి దూరి యువకుడైన అవినాష్ రెడ్డిని పట్టపగలు కిడ్నాప్ చేసేందుకు సిద్దిపేట బీజేపీ నాయకుడు చక్రధర్ గౌడ్ యత్నించారు. మేడిపల్లి శివారులో ఉంటున్న అవినాష్ రెడ్డి, తన క్లాస్‌మేట్ అరోషిక రెడ్డి కలిసి కొన్ని సంవత్సరాలు ప్రేమ వ్యవహారం నడిపారు. ఈ క్రమంలోనే ప్రియురాలు అడగడంతో అవినాష్ పెద్ద మొత్తంలో డబ్బులు కూడా అవినాష్ రెడ్డి ఇచ్చారు.


ఈ క్రమంలో అవినాష్ రెడ్డికి దూరంగా ఉంటూ అరోషిక్ రెడ్డి మరో వ్యక్తితో ప్రేమాయణం మొదలు పెట్టింది. సిద్దిపేట్ జిల్లా బీజేపీ నాయకుడు చక్రధర్ గౌడ్‌తో పలుమార్లు అవినాష్ రెడ్డితో ఫోన్ ద్వారా అరోషిక మాట్లాడించింది. అవినాష్ దగ్గర ఫోన్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు తొలగించాలని చక్రధర్ గౌడ్ బెదిరించారు. ఫోన్లో మాట్లాడాలని, డీల్ పూర్తి చేద్దాం అంటూ చక్రధర్ గౌడ్ అవినాష్ రెడ్డికి మెసేజ్ పెట్టారు.


ఘట్‌కేసర్‌లోని వరంగల్ హైవేపై ఉన్న వందన హోటల్ వద్దకు రమ్మని చెప్పటంతో, వెళ్లిన అవినాష్ రెడ్డిని కారులోకి కూర్చోమని మాట్లాడి సినిమా తరహాలో రెక్కీ నిర్వహించి చక్రధర్ తన అనుచరులతో దాడి చేసి కిడ్నాప్ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. స్థానికంగా ఉన్న ప్రజలు వెంట పడటంతో వదిలేసి దుండగులు పరారయ్యారు. అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులను అవినాష్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. చక్రధర్ గౌడ్ అరోషిత రెడ్డితో సహజీవనం చేస్తున్నాడు అంటూ చక్రధర్ పై అవినాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.