Major fire broke out in Medchal: పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని దూలప్లలి లో భారీ అగ్నిప్రమాదం చోట ుచేసుకుంది. ప్లాస్టిక్ కవర్లు తయారుచేసే పాలిమర్ కంపెనీలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. 2ఫైర్ ఇంజన్స్ సహయంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. క్రౌన్ పాలిమర్స్ అనే కంపెనీలు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారు చేస్తారు. కార్మికులు ఉత్పత్తిలో ఉన్న సమయంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు అంతా బయటకు పరుగులు తీశారు.ఇప్పటి వరకూ ఆస్తి నష్టం జరిగింది కానీ.. ప్రాణ నష్టం జరిగినట్లుగా ఎలాంటి సమాచారం లేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Medchal Fire Accident: మేడ్చల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - బుగ్గి అయిన పాలిమర్ కంపెనీ !
Raja Sekhar Allu Updated at: 16 Oct 2025 09:05 PM (IST)
Fire Accident: మేడ్చల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాలిమర్ కంపెనీ బుగ్గిగా మారింది..రెండు ఫైరింజన్లతో మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - బుగ్గి అయిన పాలిమర్ కంపెనీ !